Naomi Osaka : వింబుల్డన్‌లో చెలరేగాలనుకున్న నవొమి ఒసాకా(Naomi Osaka) కల చెదిరేలా ఉంది. గ్రాండ్‌స్లామ్ సన్నాహకాల్లో భాగంగా బ్యాడ్ హోంబర్గ్ ఓపెన్(Bad Homburg Open)లో చెలరేగిన ఒసాకా అనూహ్యంగా గాయపడింది. శనివారం జరిగిన ఫైనల్లో ఫిటెనెస్ సమస్యలతో ఇబ్బందిపడిన ఆమె.. కరోలినా ముచోవాతో మ్యాచ్ మధ్యలోనే కోర్టును వీడింది. మరో రెండు రోజుల్లో వింబుల్డన్ మొదలవ్వనుండగా.. మాజీ వరల్డ్ నంబర్ 1 బరిలోకి దిగడంపై సందేహాలు నెలకొన్నాయి.
మహిళల సింగిల్స్‌లో నాలుగు గ్రాండ్‌స్లామ్స్ గెలుపొందిన నవోమి ఒసాకా ఈసారి వింబుల్డన్‌లో ఆడుతుందా? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. సన్నాహక టోర్నీ ఫైనల్లో ఆమె గాయంతో రిటైర్ హర్ట్ అవ్వడమే అందుకు కారణం. బ్యాడ్ హోంబర్గ్ ఓపెన్ టైటిల్ పోరులో ఆరంభం నుంచి ఇబ్బంది పడిన ఒసాకా.. నా వల్ల కాదంటూ వైదొలిగింది. దాంతో, అప్పటికే 6-0, 1-0తో ఆధిక్యంలో ఉన్న కోరలినా ముచోవాను విజేతగా ప్రకటించారు. 2023లో గర్భం దాల్చడంతో ఆటకు బ్రేకిచ్చిన ఒసాకా ఈమధ్యే పునరాగమనం చేసింది.
A terrific week for the runner-up in Bad Homburg 👏@naomiosaka | #BHO26 pic.twitter.com/D1OZDC2vOP
— wta (@WTA) June 27, 2026
బ్యాడ్ హోంబర్గ్ టోర్నీలో సత్తా చాటిన జపాన్ స్టార్ అలెగ్జాండ్రోవా, వాంగ్ క్జిన్యూలను ఓడించి ఫైనల్ చేరింది. టైటిల్ విజయంతో వింబుల్డన్‌కు ముందు ఆత్మవిశ్వాసం కూడగట్టుకోవాలనుకున్న ఆమె ఆశలు అడియాశలయ్యాడు. కరోలినా ముచోవా ధాటికి తడబడిన ఒసాక.. కాసేపటికే ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడింది. గాయం కారణంగా ఆట మధ్యలోనే కోర్టు వీడింది. అయితే.. ఏ గాయం కారణంగా ఒసాకా మ్యాచ్ మధ్యలోనే వైదొలిగింది అనేది నిర్వాహకులు వెల్లడించలేదు.
A first Tour-level title on grass for Karolina Muchova 😍#BHO26 pic.twitter.com/afs6DU83yz
— wta (@WTA) June 27, 2026