MI vs CSK : ఎల్ క్లాసికో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు చేతులెత్తేశారు. చెపాక్ స్టేడియంలో సీఎస్కే పేసర్ అన్షుల్ కంబోజ్(3-32) విజృంభణకు ముంబై స్టార్లు తేలిపోగా.. నమన్ ధిర్(57) సాధికారిక ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్ రికెల్టన్(37)తో.. ఆపై సూర్యకుమార్ యాదవ్(21)తో కీలక పరగుఉల జోడించి అర్ధ శతకంతో ముంబైని ఆదుకున్నాడు. ఆఖర్లో దంచేస్తాడనుకున్న కెప్టెన్ హార్దిక్ పాండ్యా(18) పెద్ద షాట్లు ఆడలేకపోయాడు. బోల్ట్ సిక్సర్‌తో ముంబై నిర్ణీత ఓవరల్లో 159 పరుగులే చేసింది.
భారీ స్కోర్‌తో చెన్నై సూపర్ కింగ్స్‌కు సవాల్ విసరాలనుకున్న ముంబై ఇండియన్స్ మోస్తరు స్కోర్‌కే పరిమితమైంది. సీఎస్కే బౌలర్లు కట్టడి చేయడంతో.. అన్షుల్ కంబోజ్(3-32) వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే విల్ జాక్స్(1) ఔటయ్యాడు.. నమన్ ధిర్(57)తో కలిసి దంచేస్తున్న రికెల్టన్(37)ను నూర్ అహ్మద్ వెనక్కి పంపి రెండో వికెట్ అందించాడు.
Pure rescue act vibes! 💪
🎥 Catch the glimpses of Naman Dhir’s gritty 57(37) that kept the momentum going for #MI 💙
Updates ▶️ https://t.co/VVAjldiiC0#TATAIPL | #KhelBindaas | #CSKvMI | @mipaltan pic.twitter.com/2HKscFI7kh
— IndianPremierLeague (@IPL) May 2, 2026
అనంతరం సూర్యకుమార్ యాదవ్(21)మూడు ఫోర్ల, సిక్సర్‌తో కుదురుకున్నట్టే కనిపించాడు. కానీ, రామకృష్ణ ఘోష్ ఓవర్లో పెద్ద షాట్ ఆడి బ్రెవిస్ చేతికి చిక్కాడు సూర్య. అనంతరం తిలక్ వర్మ(5), రాబిన్ మిన్జ్(5)లు నిరాశపరిచారు. డెత్ ఓవర్లలో ధనాధాన్ ఆడే కెప్టెన్ హార్దిక్ పాండ్యా(18) సైతం ఇబ్బంది పడ్డారు. ఆఖరి ఓవర్లో బోల్ట్() సిక్సర్ బాదగా ముంబై నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి159కి పరిమితమైంది. 2023 నుంచి ఆడిన ఆరు మ్యాచుల్లో ఐదింటా ముంబైని ఓడించిన చెన్నై సిక్సర్ కొట్టాలనే పట్టుదలతో ఉంది.