Rafael Nadal | ఈ ఏడాది ఆఖరి మ్యాచ్‌లో నాదల్కు నిరాశ.. యునైటెడ్ కప్‌లో ఓటమి
నోరికి నాదల్‌పై ఇది తొలి సింగిల్స్ విజయం
Rafael Nadal : ఈ ఏడాదికి విజయంతో వీడ్కోలు పలకాలి అనుకున్న టెన్నిస్ స్టార్ ఆటగాడు రఫెల్ నాదల్కు నిరాశే ఎదురైంది. ఈ ఏడాది ఆఖరి మ్యాచ్‌లో అతను ఓటమి పాలయ్యాడు. సిడ్నీలో శనివారం జరిగిన యునైటెడ్ కప్ మిక్స్డ్ టోర్నమెంట్లో అతను బ్రిటన్‌కు చెందిన కామెరూన్ నోరీ చేతిలో పరాజయం చెందాడు. నోరీ 3-6, 6-3, 6-4తో నాదల్‌పై గెలుపోందాడు. దాంతో, బ్రిటన్ జట్టు 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇది నోరికి నాదల్‌పై తొలి సింగిల్స్ విజయం. గతంలో నాలుగుసార్లు నాదల్‌తో తలపడిన అతను ఒక్క సెట్ కూడా గెలవలేదు. ‘నాకు చాలా సంతోషంగా ఉంది. మ్యాచ్ సమయంలో నాదల్‌పై గతంలో ఒక్క సెట్ కూడా గెలవలేదనే విషయాన్నినేను అస్సలు తలచుకోలేదు. ఉత్తమంగా ఆడాలని నిర్ణయించుకున్నా. విజయంతో 2022కు వీడ్కోలు పలకడం చాలా గొప్పగా అనిపిస్తోంది’ అని మ్యాచ్ అనంతరం నోరీ తెలిపాడు.
నవంబర్‌లో జరిగిన ఏటీపీ ఫైనల్స్ తర్వాత స్పెయిన్ బుల్ ఆడిన తొలి మ్యాచ్ ఇది. మట్టి కోట రారాజుగా పేరొందిన నాదల్ ఈ ఏడాది ఫ్రెంచ్ టోర్నమెంట్ విజేతగా నిలిచాడు. మాజీ వరల్డ్ నంబర్ 1 అయిన నాదల్ మోకాలి గాయాలు వెంటాడుతున్నా కూడా మట్టి కోటలో తనకు ఎదరులేదని నిరూపించాడు. ఇప్పటి వరకు ఈ క్లే కింగ్ 22 గ్రాండ్‌స్లామ్స్ సాధించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

