నువ్వే నాకు ప్రేరణ.. నాదల్కు ఫెదరర్ మెసేజ్

మెల్బోర్న్: టెన్నిస్ చరిత్రలో 21 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచి చరిత్ర సృష్టించిన స్పెయిన్ ఆటగాడు రఫేల్ నాదల్కు మరో గ్రేట్ ప్లేయర్ రోజర్ ఫెదరర్ కంగ్రాట్స్ చెప్పారు. ఆదివారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో అత్యద్భుత పోరాట స్పూర్తిని ప్రదర్శిస్తూ.. మెద్వెదెవ్‌తో జరిగిన హోరాహోరీ పోరులో నాదల్ నెగ్గిన విషయం తెలిసిందే. అయితే ఆ విక్టరీపై ఫెదరర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రియాక్ట్ అయ్యారు. ఆహా అది ఏం మ్యాచ్ అని, 21 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచిన మిత్రుడు, బలమైన ప్రత్యర్థి అయిన రాఫేల్ నాదల్ కు హృదయపూర్వక అభనందనలు తెలుపుతున్నట్లు ఫెదరర్ తన ఇన్‌స్టాలో పేర్కొన్నాడు. ఓ గొప్ప చాంపియన్‌ను ఎప్పుడూ తక్కువగా అంచనా వేయలేమన్నాడు. నువ్వు చూపించిన తెగువ, సాహసం, పట్టుదల తనకు, ఇంకా ఎంతో మందికి ప్రేరణ ఇస్తోందన్నాడు. ఈ యుగాన్ని నీతో పంచుకున్నందుకు గర్వంగా ఉందన్నాడు. గత 18 ఏళ్ల నుంచి నీతో కలిసి ఆడడం గౌరవంగా భావిస్తున్నట్లు వెల్లడించాడు. ఆదివారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో నాదల్ 2-6, 6-7 (5), 6-4, 6-4, 7-5 స్కోరుతో మెద్వెదెవ్పై గెలుపొందాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

