హైదరాబాద్: ఇండియన్ క్రికెటర్ మురళీ విజయ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు అతను పేర్కొన్నాడు. 87 మ్యాచ్‌లు ఆడిన అతను 4490 రన్స్ చేశాడు. అత్యధికంగా అతను 61 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. దాంట్లో 3982 రన్స్ స్కోర్ చేశాడు. అతని సగటు 38.29.
@BCCI @TNCACricket @IPL @ChennaiIPL pic.twitter.com/ri8CCPzzWK
— Murali Vijay (@mvj888) January 30, 2023
ఇండియా తరపున మురళీ విజయ్ 17 వన్డేలు, 9 టీ20లు ఆడాడు. ట్విట్టర్ ద్వారా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని విజయ్ వెల్లడించారు. భావోద్వేగమైన ఆ పోస్టులో తన కెరీర్ గురించి చెప్పాడు. 2002 నుంచి 2018 వరకు తన అంతర్జాతీయ కెరీర్ సాగినట్లు పేర్కొన్నాడు.