LSG vs KKR : అసలే అట్టడుగున నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్‌ను లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మొహ్సిన్ ఖాన్(5-23) భయపెట్టాడు. సొంత మైదానంలో నిప్పులు చెరిగిన ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కోల్‌కతా టాపార్డర్ కూల్చాడు. ప్రధాన ఆటగాళ్లు చేతులెత్తేసిన చోట వైస్ కెప్టెన్ రింకూ సింగ్((83 నాటౌట్) సిక్సర్ల మోతతో హోరెత్తించాడు. సహచరులు పెవిలియన్‌కు క్యూ కట్టినా పట్టుదలగా ఆడిన రింకూ.. దిగ్వేశ్ రథీ వేసిన ఆఖరి ఓవర్లో నాలుగు సిక్సర్లతో కోల్‌కతా స్కోర్ 150 దాటించాడు.
పంతొమ్మిదీ సీజన్లో మరోసారి బ్యాటింగ్ వైఫల్యాన్ని కొనసాగించింది కోల్‌కతా నైట్ రైడర్స్. లక్నో గడ్డపై మొహ్సిన్ ఖాన్(5-23) నిప్పులు చెరగడంతో కోల్‌కతా టాపార్డర్ కుప్పకూలింది. టిమ్ సీఫర్ట్(0), అజింక్యా రహానే(10)లను ఔట్ చేసి షాకిచ్చిన మొహ్సిన్ కోల్‌కతా శుభారంభం ఆశలపై నీళ్లు చల్లాడు. ఈ సీజన్లో దంచేస్తున్న యువకెరటం రఘువంశీ(9) ఫీల్డింగ్‌కు అడ్డుపడినందున థర్డ్ అంపైర్ ఔటిచ్చాడు. కాసేపటికే రొవ్మన్ పావెల్(9)ను వెనక్కి పంపిన మొహ్సిన్ కోల్‌కతాను పవర్ ప్లేలోనే పీకల్లోతు కష్టాల్లోకి నెట్టాడు.
8️⃣ dots
5️⃣ wickets
Only 3️⃣ boundary ballsA spell sending the #KKR line-up in disarray 🔥
WATCH IT HERE ▶️ https://t.co/o3aS9YrfuN#TATAIPL | #KhelBindaas | #LSGvKKR pic.twitter.com/nUVFhEVyX1
— IndianPremierLeague (@IPL) April 26, 2026
మొహ్సిన్ విజృంభణతో 31కే నాలుగు వికెట్లు పడిన వేళ.. కామెరూన్ గ్రీన్(34), రింకూ సింగ్(83 నాటౌట్)లు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ, గ్రీన్‌ను సైతం వెనక్కి పంపిన మొహ్సిన్ కోల్‌కతాను ఆలౌట్ అంచున నిలిపాడు. అయితే.. రమన్‌దీప్ సింగ్(6)తో కలిసి రింకూ జట్టుకు గౌరవప్రదమైన స్కోరందించే బాధ్యత తీసుకున్నాడు.
6⃣, 6⃣, 6⃣, 6⃣ 🤯
🎥 Enjoy Rinku Singh’s sizzling ball-striking in the last over 🔥
Scorecard ▶️ https://t.co/elFxwvCeWO#TATAIPL | #KhelBindaas | #LSGvKKR | @KKRiders pic.twitter.com/98wGgWK14c
— IndianPremierLeague (@IPL) April 26, 2026
కానీ, లక్నో బౌలర్లు బౌండరీలు బాదేందుదుకు అవకాశమివ్వకపోవడంతో కోల్‌కతా స్కోర్ 130 దాటుడే కష్టమనిపించింది. అయితే.. 2023 యశ్ దయాల్‌ను ఉతికేసినట్టే.. దిగ్వేశ్ రథీ వేసిన ఇన్నింగ్స్ రింకూ సిక్సర్లతో రెచ్చిపోయాడు. ఆఖరి ఓవర్లో నాలుగు బంతుల్ని స్టాండ్స్‌లోకి పంపడంతో కోల్‌కతా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి155 పరుగులు చేయగలిగింది.