నా ఫిట్నెస్ మీరే చూస్తున్నారు కదా!
జాతీయ జట్టులో చోటు కోల్పోయినా దేశవాళీల్లో సత్తాచాటుతున్న సీనియర్ పేసర్ మహ్మద్ షమీ తన ఫిట్నెస్, రిథమ్, ఫ్యూచర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రెండ్రోజుల క్రితమే మొదలైన రంజీ ట్రోఫీ తాజా సీజన్లో తొలి రోజే ఈ బెంగాల్ పేసర్ నాలుగు వికెట్లు తీసి అదరగొట్టాడు.
- సెలక్టర్ల గురించి పట్టించుకోను
- టీమిండియాలోకి భువీ ముందే రావాల్సింది
- షమీ ఆసక్తికర వ్యాఖ్యలు
కోల్‌కతా : జాతీయ జట్టులో చోటు కోల్పోయినా దేశవాళీల్లో సత్తాచాటుతున్న సీనియర్ పేసర్ మహ్మద్ షమీ తన ఫిట్నెస్, రిథమ్, ఫ్యూచర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రెండ్రోజుల క్రితమే మొదలైన రంజీ ట్రోఫీ తాజా సీజన్లో తొలి రోజే ఈ బెంగాల్ పేసర్ నాలుగు వికెట్లు తీసి అదరగొట్టాడు. తన ఫామ్, ఫిట్‌నెస్‌పై వస్తున్న వార్తలపై షమీ స్పందిస్తూ.. ‘నేను ఎక్కడ (జాతీయ జట్టుకు, దేశవాళీల్లో) ఆడినా ఆటలో పెద్దగా మార్పేమీ కనిపించదు. ఎవరి అభిప్రాయాలు వారికుంటాయి. నా రిథమ్ కోల్పోయానని, ఫిట్నెస్ పోయిందని.. ఇలా ఏవేవో అంటుంటారు. నేను వాటిని పట్టించుకోను. నా ఆటను ఆస్వాదిస్తున్నా. మీరు నా ఆటను చూస్తున్నారు కదా’ అని అన్నాడు.
జాతీయ సెలక్టర్లెవరైనా తనను సంప్రదించారా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘నేను గ్రౌండ్ లోపల ఉంటాను. నా చేతుల్లో ఉన్నది నా ఆట మాత్రమే. బౌలింగ్ చేయడమే నా పని. ఆ విషయాలు (సెలక్టర్ల గురించి) పట్టించుకోను. భవిష్యత్‌లో ఏం జరుగుతుందనేది నా చేతుల్లో లేదు’ అని అన్నాడు. ఇక సుదీర్ఘ విరామం తర్వాత జాతీయ జట్టులోకి భువనేశ్వర్ రాకను స్వాగతించిన షమీ.. ‘టీమిండియాలోకి భువీ ఇంకా ముందే రావాల్సింది. అతడు ఎవరితోనూ మాట్లాడడు. అలా అని ఒక ప్రతిభావంతుడైన ఆటగాడిని మీరు ఎన్నాళ్లు దాచిపెట్టగలరు? ఐపీఎల్లో అద్భుత ప్రదర్శనతో సత్తాచాటి తన జట్టు వరుసగా రెండు ట్రోఫీలు గెలవడంలో కీలకపాత్ర పోషించాడు’ అని తెలిపాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

