Mohammad Siraj | నంబర్ 1 బౌలర్ అవుతానని ఊహించలేదు : సిరాజ్
తాను వరల్డ్ నంబర్ 1 బౌలర్ అవుతానని అసలు ఊహించలేదని టీమిండియా స్విగ్ సుల్తాన్ మహమ్మద్ సిరాజ్ తెలిపాడు. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలో సిరాజ్ వరల్డ్ నం 1 కావడంపై స్పందించాడు.
Mohammad Siraj : తాను వరల్డ్ నంబర్ 1 బౌలర్ అవుతానని అసలు ఊహించలేదని టీమిండియా స్విగ్ సుల్తాన్ మహమ్మద్ సిరాజ్ తెలిపాడు. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలో సిరాజ్ వరల్డ్ నం 1 కావడంపై స్పందించాడు. అశ్విన్ షేర్ చేసిన ఆ వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది. అందులో ‘వన్డేల్లో వరల్డ్ నంబర్ 1 బౌలర్ అయినందుకు ఎలా ఫీలవుతున్నావు?’ అని ఈ ఆఫ్ స్పిన్నర్ సిరాజ్‌ను అడిగాడు. అందుకు ఈ స్పీడ్‌స్టర్.. ‘చాలా సంతోషంగా అనిపించింది. నేను వరల్డ్ నంబర్ 1 బౌలర్ అవుతానని అనుకోలేదు’ అని బదులిచ్చాడు. న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్, ఆస్ట్రేలియా పేసర్ హేజిల్‌వుడ్‌ను వెనక్కి నెట్టి సిరాజ్ 729 పాయింట్లతో అగ్రస్థానం సొంతం చేసుకున్నాడు.
వన్డేల్లో అత్యధిక వికెట్లు
స్వదేశంలో ఈ మధ్య జరిగిన శ్రీలంక, న్యూజిలాండ్ సిరీస్‌లో సిరాజ్ అద్భుతంగా రాణించాడు. శ్రీలంకపై మూడు వన్డేల్లో 9 వికెట్లు పడగొట్టాడు. రెండు సార్లు కెరీర్లో తొలి ఐదు వికెట్ల ప్రదర్శనకు వికెట్ దూరంలో నిలిచాడు. భారత జట్టు వన్డే సిరీస్ గెలవడంలో ఈ హైదరాబాదీ పేసర్ కీలక పాత్ర పోషించాడు. పోయిన ఏడాది వన్డేల్లో టీమిండియా తరఫున అత్యధికంగా 23 వికెట్లు తీశాడు. మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానున్న బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో సత్తా చాటేందుకు సిరాజ్ ఉవ్విళ్లూరుతున్నాడు. గాయంతో బుమ్రా దూరం కావడంతో షమీతో కలిసి అతను భారత బౌలింగ్ దళాన్ని నడిపించనున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

