Mohammad Shami | రంజీల్లో షమీ సోదరుడు.. తడాఖా చూపించాలంటూ స్పీడ్‌స్టర్ సలహా
Mohammad Shami : వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు సీనియర్ పేసర్ మహ్మద్ షమీ(Mohammad Shami) సంచలన బౌలింగ్ ప్రదర్శనను ఇప్పట్లో మర్చిపోలేం. బుల్లెట్ లాంటి బంతులతో బ్యాటర్లను వణికించిన షమీ మాయాజాలం కండ్ల ముందు మెదులుతున్న సమయంలోనే ఈ స్పీడ్‌స్టర్ కుటుంబం..
Mohammad Shami : వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు సీనియర్ పేసర్ మహ్మద్ షమీ(Mohammad Shami) సంచలన బౌలింగ్ ప్రదర్శనను ఇప్పట్లో మర్చిపోలేం. బుల్లెట్ లాంటి బంతులతో బ్యాటర్లను వణికించిన షమీ మాయాజాలం కండ్ల ముందు మెదులుతున్న సమయంలోనే ఈ స్పీడ్‌స్టర్ కుటుంబం నుంచి మరో పేసర్ దూసుకొస్తున్నాడు. అవును.. షమీ సోదరుడు కైఫ్(Kaif) తాజాగా రంజీ(Ranji Trophy)ల్లో అరంగేట్రం చేశాడు. బెంగాల్ తరఫున ఆంధ్రాతో జరిగిన మ్యాచ్‌లో కైఫ్ బరిలోకి దిగాడు.
ఈ సందర్భంగా షమీ సోదరుడి కెరీర్ అద్భుతంగా సాగాలని ఆకాంక్షిస్తూ పోస్ట్ పెట్టాడు. ‘ఎన్నో కష్టాల తర్వాత చివరకు బెంగాల్ తరఫున రంజీల్లో అరంగేట్రం చేస్తున్నావు. ఇది గొప్ప విజయం. నీ భవిష్యత్ అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా. మైదానంలోకి దిగిన ప్రతిసారి వంద శాతం పోరాడు. మరితం మెరుగయ్యేందుకు నిరంతరం కష్టపడు’ అని షమీ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు.
పుష్కరకాలం తర్వాత సొంత గడ్డపై జరిగిన ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్ చేరింది. కోహ్లీ, రోహిత్ వీరబాదుడు, పేసర్ షమీ విజృంభణతో లీగ్ దశలో పెద్ద జట్లకు షాకిస్తూ దూసుకెళ్లింది. టోర్నీ ఆసాంతం సంచలన ప్రదర్శన చేసిన షమీ 21 వికెట్లతో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు.

అయితే.. మోగా టోర్నీ అనంతరం దక్షిణాఫ్రికా పర్యటన(South Africa Tour)కు షమీ దూరమయ్యాడు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్ కోసం షమీ సిద్ధమవుతున్నాడు.
ఇవి కూడా చదవండి
- Ravindra Jadeja | ఎండ్లబండి నడిపిన టీమిండియా ఆల్‌రౌండర్.. వీడియో వైరల్
- PM Sheikh Hasina | భారత్ వంటి నమ్మకమైన మిత్రదేశం ఉండటం మా అదృష్టం: బంగ్లా పీఎం హసీనా
- Ananya Raj | గ్లామర్ డోస్ పెంచేసిన అనన్య రాజ్..
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Bengal
- CWC 2023
- kaif
- Mohammed Shami
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

