చిన్మయ్ 400 నాటౌట్.. క్వాడ్రబుల్ సెంచరీ చేసిన రెండో భారత క్రికెటర్
సుదీర్ఘ చరిత్ర కల్గిన రంజీ ట్రోఫీలో మిజోరాం బ్యాటర్ చిన్మయ్ సుతార్ సంచలన ప్రదర్శనతో రికార్డుల దుమ్ముదులిపాడు. రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్‌లో నాగాలాండ్‌తో ఆడుతున్న మ్యాచ్‌లో సుతార్ (517 బంతుల్లో 400 నాటౌట్, 46 ఫోర్లు, 7 సిక్స్‌లు) ఈ టోర్నీ చరిత్రలో క్వాడ్రబుల్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు.
- మిజోరాం బ్యాటర్ సరికొత్త చరిత్ర
సొవిమా (నాగాలాండ్) : సుదీర్ఘ చరిత్ర కల్గిన రంజీ ట్రోఫీలో మిజోరాం బ్యాటర్ చిన్మయ్ సుతార్ సంచలన ప్రదర్శనతో రికార్డుల దుమ్ముదులిపాడు. రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్‌లో నాగాలాండ్‌తో ఆడుతున్న మ్యాచ్‌లో సుతార్ (517 బంతుల్లో 400 నాటౌట్, 46 ఫోర్లు, 7 సిక్స్‌లు) ఈ టోర్నీ చరిత్రలో క్వాడ్రబుల్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. మొత్తంగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో పదో ప్లేయర్‌గా నిలిచాడు. రంజీల్లో ఈ ఘనత సాధించినవారిలో ఈ రికార్డు గతంలో మహారాష్ట్ర బ్యాటర్ బాబాసాహెబ్ నింబాల్కర్ (443 నాటౌట్- 1948లో ఖతియావార్పై) పేరిట ఉండేది.
ఓవరాల్‌గా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరుచేసిన బ్యాటర్‌గా వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా (1994లో వార్విక్షేర్ తరఫున ఆడుతూ డర్హమ్‌పై 501నాటౌట్) పేరిట నమోదైంది. కాగా, సుతార్ క్వాడ్రబుల్ సెంచరీతో తొలి ఇన్నింగ్స్‌లో మిజోరాం.. తొలి ఇన్నింగ్స్‌ను 581 రన్స్ వద్ద డిక్లేర్ చేసింది. సహచర బ్యాటర్లంతా విఫలమవగా మిజోరాం స్కోరు 392 పరుగుల వద్ద ఉండగా పదో నంబర్ బ్యాటర్ చాక్చువాక్ క్రీజులోకి రాగా అతడిని నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో నిలబెట్టిన సుతార్ పదో వికెట్‌కు ఏకంగా 189 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. ఇందులో సుతార్ చేసినవే 169 కావడం విశేషం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

