Mitchell Starc: ఐపీఎల్లో ఆడేందుకు మిచెల్ స్టార్క్ వచ్చేస్తున్నాడు..
Mitchell Starc: ఐపీఎల్లో ఆడేందుకు మిచెల్ స్టార్క్ వచ్చేస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో అతను త్వరలో కలవబోతున్నాడు. మే ఒకటో తేదీన రాజస్థాన్ రాయల్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో.. స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్ ఆడే అవకాశాలు ఉన్నాయి.
మే: ఐపీఎల్లో ఆడేందుకు ఆస్ట్రేలియా మేటి బౌలర్ మిచెల్ స్టార్క్(Mitchell Starc)కు ఆ దేశ క్రికెటర్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో అతను త్వరలో కలవబోతున్నాడు. మే ఒకటో తేదీన రాజస్థాన్ రాయల్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో.. స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్ ఆడే అవకాశాలు ఉన్నాయి. మోచేయి, భుజం నొప్ప కారణంగా జనవరి నుంచి స్టార్క్ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన యాషెస్ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును గెలుచుకున్న విషయం తెలిసిందే. స్టార్క్ మళ్లీ తన పంజా విసరనున్నాడని, 2026 ఐపీఎల్ సీజన్లో అతను ఆర్ఆర్తో జరిగే మ్యాచ్‌లో ఆడే ఛాన్సు ఉన్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది.
ఐపీఎల్లో ప్రారంభ మ్యాచ్‌లకు విదేశీ ఆటగాళ్లు కొందరు దూరం కావడం వివాదాస్పదమైంది. అయితే తనకు గాయమైనట్లు స్టార్క్ ఇటీవల తన ఇన్‌స్టాలో పేర్కొన్నాడు. గత ఏడాది ఐపీఎల్లో ఢిల్లీ తరపున స్టార్క్ 11 మ్యాచ్‌లు ఆడి 14 వికెట్లు తీసుకున్నాడు. ఇప్పటి వరకు ఢిల్లీ ఈ సీజన్లో పాయింట్ల పట్టికలో అయిదో స్థానంలో ఉన్నది. మూడు ఓటములు, మూడు గెలుపులు ఉన్నాయి. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కూడా ఐపీఎల్లో ఆడనున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అతను త్వరలో తొలి మ్యాచ్ ఆడే ఛాన్సు ఉన్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

