కంగ్రాట్స్ నిఖత్ జరీన్.. మంత్రి కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్ : తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో స్వర్ణ పతకంతో మెరిసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. జరీన్‌కు ట్విటర్ వేదికా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. 2019 స్ట్రాంజా స్మారక టోర్నీలో స్వర్ణం చేజిక్కించుకున్న ఈ ఇందూరు చిచ్చర పిడుగు.. తన పిడిగుద్దులతో మరోసారి పసిడి పతకం ఖాతాలో వేసుకుంది. కరోనా కష్టకాలంలో పడ్డ శ్రమకు తగ్గ ఫలితం దక్కించుకుంది.
బల్గేరియా వేదికగా ఆదివారం జరిగిన మహిళల 52 కేజీల ఫైనల్లో తెలంగాణ స్టార్ నిఖత్ 4-1 తేడాతో టెటియానా కోబ్ (ఉక్రెయిన్)ను చిత్తు చేసింది. సెమీఫైనల్లో టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత బూసనాజ్పై గెలుపొందిన నిఖత్.. ఆఖరి పోరులోనూ అదేస్థాయి ప్రదర్శన కనబర్చింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా హుక్, క్రాస్, జాబ్ పంచ్‌లతో విరుచుకుపడింది. 48 కేజీల విభాగంలో మరో భారత బాక్సర్ నీతూ 5-0తో ఎరికా ప్రిసియాండారో (ఇటలీ)పై నెగ్గి పసిడి ఖాతాలో వేసుకుంది.
Congratulations Nikhat 👏 https://t.co/aNRgcr3pMx
— KTR (@KTRTRS) February 28, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

