గొప్ప మనసు చాటుకున్న కేటీఆర్.. చెస్ చాంపియన్ మలికకు రూ. 15 లక్షల ఆర్థిక సాయం
Minister KTR | తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గొప్ప మనసు చాటుకున్నారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన బధిర చెస్ ప్లేయర్ మలికా హండా తన కుటుంబ సభ్యులతో కేటీఆర్‌ను సోమవారం కలిశారు. ఈ సందర్భంగా మలికా

హైదరాబాద్ : తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గొప్ప మనసు చాటుకున్నారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన బధిర చెస్ ప్లేయర్ మలికా హండా తన కుటుంబ సభ్యులతో కేటీఆర్‌ను ప్రగతి భవన్లో సోమవారం కలిశారు. ఈ సందర్భంగా మలికా హండాకు కేటీఆర్ రూ. 15 లక్షల ఆర్థిక సాయం చేశారు. చెస్ పోటీల కోసం సిద్ధమయ్యేందుకు గానూ, ఆమెకు ఉపయోగపడే విధంగా ల్యాప్‌టాప్‌ను కూడా కేటీఆర్ బహుకరించారు. మలికాకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను కేటీఆర్ కోరారు. మంత్రి కేటీఆర్‌కు మలికాతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మలికా హండా.. బధిర చెస్ ప్లేయర్. పంజాబ్‌కు చెందిన మలిక పుట్టుకతోనే చెవిటి, మూగ సమస్యలతో బాధపడుతున్నది. అయితే వైకల్యం తన శరీరానికే కానీ ప్రతిభకు కాదని ఘనంగా చాటిచెప్పింది. కెరీర్లో ఇప్పటి వరకు ప్రపంచ టోర్నీతో పాటు ఆసియా చాంపియన్‌షిప్‌లో రెండు స్వర్ణాలు సహా నాలుగు రజతాలతో మెరిసింది. అంతటితో ఆగకుండా జాతీయ బధిర చెస్ చాంపియన్‌షిప్‌లో ఏకంగా ఏడుసార్లు పసిడి పతకం కైవసం చేసుకుంది.
ఇలా జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో ఈ 26 ఏండ్ల చెస్ ప్లేయర్ లెక్కకు మిక్కిలి పతకాలు కైవసం చేసుకుంది. ఇక్కడి వరకు బాగానే ఉంది. తన సొంత రాష్ట్రం పంజాబ్ నుంచి ఆమెకు సరైన ప్రోత్సాహం కరువైంది. అద్భుత ప్రదర్శన కనబరిచే మాలికను పంజాబ్ సర్కార్ కనీసం పట్టించుకున్నది లేదు. దీంతో విసిగివేసారిన మలిక..తన ఆక్రోశాన్ని ట్విటర్ వేదికగా వెల్లగక్కింది. బధిర ప్లేయర్ల కోసం ప్రభుత్వ ఉద్యోగాలు, నగదు ప్రోత్సాహకాలు తమ పాలసీలో లేవన్న ఆ రాష్ట్ర క్రీడా మంత్రి పర్గత్‌సింగ్‌ను లక్ష్యంగా చేసుకుంటూ తన కోపాన్ని వ్యక్తపరిచింది.
అయితే తన దృష్టికి వచ్చిన ఈ ట్వీట్‌పై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. మలికకు సంబంధించి వివరాలు అందిస్తే వ్యక్తిగతంగా వీలైనంత సాయం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు మంత్రి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. మంత్రి కార్యాలయ సిబ్బంది మలిక కుటుంబ సభ్యులను వెంటనే సంప్రదించారు. తమ కూతురుకు మంత్రి కేటీఆర్ సాయం అందించేందుకు ముందుకు రావడంపై కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉంటే సునీతాకృష్ణన్ ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ స్పందిస్తూ దివ్యాంగ చాంపియన్ల కోసం ప్రత్యేకంగా ఒక పాలసీ రూపొందించాలని క్రీడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కోరుతూ మరో ట్వీట్ చేశారు.
Kept my promise to help the talented @MalikaHanda Ji
— KTR (@KTRBRS) January 10, 2022
Met her today & extended financial support of ₹15 lakhs (in personal capacity) & gifted her a laptop which will help her in preparation for future championships
Request Sports Minister @ianuragthakur Ji to get her a Govt job pic.twitter.com/2j126WVY1b
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

