MI vs RR | రెండోసారీ లక్ష్యాన్ని కాపాడుకున్న రాజస్థాన్.. ముంబైపై సూపర్ విక్టరీ
ఈ ఐపీఎల్లో లక్ష్యాన్ని కాపాడుకున్న ఏకైక జట్టు రాజస్థాన్. మరోసారి తమ మ్యాజిక్ రిపీట్ చేసింది. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ముంబైని కట్టడి చేయడంతో రాజస్థాన్ బౌలర్లు సఫలీకృతం అయ్యారు. అంతకుముందు జోస్ బట్లర్ (100), శాంసన్ (30), హెట్మెయర్ (35) రాణించడంతో రాజస్థాన్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో ముంబైకి ఆరంభంలోనే షాక్ తగిలింది.
కెప్టెన్ రోహిత్ శర్మ (5) రెండో ఓవర్లోనే వెనుతిరిగాడు. ఆ తర్వాత కాసేపటికే అన్మోల్ప్రీత్ సింగ్ (5) కూడా అవుటయ్యాడు. ఇలాంటి సమయంలో ఇషాన్ కిషన్ (54), తిలక్ వర్మ (61) ముంబైని ఆదుకున్నారు. వాళ్లిద్దరూ క్రీజులో ఉంటే ముంబై లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించింది. అయితే ట్రెంట్ బౌల్ట్ ఈ జోడీని విడగొట్టాడు. ఇషాన్‌ను అవుట్ చేశాడు. ఆ తర్వాత అశ్విన్ బౌలింగ్‌లో తిలక్ వర్మ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
అయితే క్రీజులో పొలార్డ్ ఉండటంతో ముంబై అభిమానులకు విజయంపై ఆశలు మిగిలే ఉన్నాయి. 19వ ఓవర్లో పొలార్డ్ ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను యశస్వి జైస్వాల్ జారవిడవడంతో ఉత్కంఠ నెలకొంది. ఒక లైఫ్ లభించిన తర్వాత పొలార్డ్ ఊరికినే ఉంటాడా? దంచి కొట్టడూ? అని ముంబై ఫ్యాన్స్ అనుకున్నారు.
కానీ చివరి రెండు ఓవర్లలో ప్రసిద్ధ్ కృష్ణ, నవదీప్ సైని అద్భుతంగా బౌలింగ్ చేసి పొలార్డ్‌ను భారీ షాట్లు ఆడకుండా చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి ముంబై జట్టు 8 వికెట్ల నష్టానికి 170 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో రాజస్థాన్ 23 పరుగుల తేడాతో గెలుపొందింది. రాజస్థాన్ బౌలర్లలో చాహల్, సైని రెండేసి వికెట్లు తీయగా.. బౌల్ట్, ప్రసిద్ధ్, అశ్విన్ తలో వికెట్ తీసుకున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

