Hockey World Cup 2023 | తొలి మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ను చిత్తుచిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా
Hockey World Cup 2023 | ఒడిశా వేదికగా 15వ హాకీ ప్రపంచకప్ ఆరంభమైంది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ జట్లు తపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ను ఆస్ట్రేలియా టీమ్ చిత్తుచిత్తుగా
భువనేశ్వర్: ఒడిశా వేదికగా 15వ హాకీ ప్రపంచకప్ ఆరంభమైంది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ జట్లు తపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ను ఆస్ట్రేలియా టీమ్ చిత్తుచిత్తుగా 8-0 గోల్స్ తేడాతో ఓడించింది. ఆస్ట్రేలియా మొత్తం 8 గోల్స్ చేయగా, అందులో ఆ జట్టు ఆటగాడు జిరేమీ హ్యాట్రిక్ గోల్స్ కొట్టాడు. ఈ ప్రపంచకప్‌లో ఇదే తొలి హ్యాట్రిక్.
కాగా, ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్ టీమ్ పేలవ ప్రదర్శనను కనబర్చింది. పెనాల్టీ కార్నర్ల రూపంలో ఎన్నో అవకాశాలు వచ్చినా ఫ్రాన్స్ జట్టు వాటిని గోల్స్‌గా మలచడంలో విఫలమైంది. అందివచ్చిన అవకాశాలన్నింటినీ చేజార్చుకుంది. కాగా, 2018 ప్రపంచకప్‌లో కూడా ఫ్రాన్స్‌పై ఆస్ట్రేలియా హాకీ టీమ్ 3-0 గోల్స్ తేడాతో విజయం సాధించింది.
ఇదిలావుంటే, సౌతాఫ్రికా, అర్జెంటీనా జట్ల మధ్య హోరాహోరి మ్యాచ్‌లో ఆఖరికి అర్జెంటీనా విజయాన్ని అందుకుంది. రెండు జట్లు అద్భుతంగా ఆడిన ఆర్జెంటీనా ఒక గోల్ చేయగలగడంతో సౌతాఫ్రికాపై 1-0 తేడా నెగ్గింది. ఇవాళ రాత్రి 7 గంటలకు భారత్, స్పెయిన్ జట్ల మధ్య మరో మ్యాచ్ జరగనుంది. మొత్తం 16 జట్లు లీగ్ దశలో నాలుగు గ్రూపులుగా టోర్నీలో తలపడుతున్నాయి.
భారత జట్టు స్పెయిన్, వేల్స్, ఇంగ్లండ్ జట్లతో కలిసి గ్రూప్-D లో ఉన్నది. గ్రూప్-A లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, అర్జెంటీనా జట్లు, గ్రూప్-B లో బెల్జియం, జపాన్, కొరియా, జర్మనీ జట్లు, గ్రూప్-C లో నెదర్లాండ్స్, చిలీ, మలేషియా, న్యూజిలాండ్ జట్లు ఉన్నాయి. నాలుగో గ్రూప్‌ల నుంచి రెండేసి జట్ల చొప్పున క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంటాయి. క్వార్టర్ ఫైనల్స్ నెగ్గిన నాలుగు జట్లు సెమీ ఫైనల్స్ ఆడుతాయి. సెమీఫైనల్స్ గెలిచిన రెండు జట్ల మధ్య ఫైనల్ జరుగుతుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

