కోల్‌కతా: తుంటి నొప్పితో బాధపడుతున్నట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్(Maxwell) తెలిపాడు. ఇప్పటికే ఈ టోర్నీలో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ఆ స్టార్ క్రికెటర్ ప్రస్తుతం కఠిన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాడు. ఇక ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరగనున్న మ్యాచ్‌కు కూడా అతను ఆడేది డౌట్‌గానే ఉన్నది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ 5.33 యావరేజ్‌తో మొత్తం 32 రన్స్ చేశాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ ఆడలేదు. శారీరక, మానసిక వత్తిడి వల్ల సరిగా ఆడలేకపోయినట్లు మ్యాక్సీ తెలిపాడు. ఇటీవల తుంటి నొప్పి మొదలైందని, రికవరీ కోసం కొన్ని రోజులు పడుతుందని అతను వెల్లడించాడు.