Home
Sports
Max Verstappen Wins Record Breaking 14th Race Of The Season At Formula Ones Mexican Grand Prix
వెర్స్టాపెన్ @14
రెడ్‌బుల్ డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ ఫార్ములా వన్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఒకే సీజన్లో అత్యధిక విజయాలు(14) సాధించిన తొలి రేసర్‌గా వెర్స్టాపెన్ చరిత్ర సృష్టించాడు.
మెక్సికో సిటీ : రెడ్‌బుల్ డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ ఫార్ములా వన్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఒకే సీజన్లో అత్యధిక విజయాలు(14) సాధించిన తొలి రేసర్‌గా వెర్స్టాపెన్ చరిత్ర సృష్టించాడు. ఆదివారం జరిగిన మెక్సికో సిటీ గ్రాండ్‌ప్రిలో అతడు సమీప ప్రత్యర్థి లూయిస్ హామిల్టన్ కంటే 15.186 సెకన్ల ముందు గమ్యాన్ని చేరుకుని టైటిల్ విజేతగా నిలిచాడు.
మెక్సికోలో వెర్‌స్టాపెన్‌కు ఇది నాలుగో టైటిల్. ఈ క్రమంలో ఒక సీజన్లో అత్యధిక టైటిళ్లు(13) సాధించిన జర్మనీ రేసర్లు మైఖేల్ షుమాకర్(2004), సెబాస్టియన్ వెటెల్(2013)ను వెర్స్టాపెన్ అధిగమించాడు. అయితే గతంలో కంటే రేసుల సంఖ్య పెరగడం వెర్స్టాపెన్ విజయాలకు దోహదపడింది. 2013లో 19 రేసులు, 2014లో 18 రేసులు జరుగగా, ఈ సీజన్లో మొత్తం 22 రేసులు నిర్వహించనున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

