CSK Vs MI | చెన్నై సూపర్ కింగ్స్‌కు షాక్..! ముంబయితో మ్యాచ్‌కు మతీషా పతిరనా దూరం..!
CSK Vs MI | ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబయి ఇండియన్స్‌తో మ్యాచ్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బిగ్ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్‌కు స్టార్ పేసర్ మతీషా పతిరనా అందుబాటులో ఉండే అవకాశం లేదని ఆ జట్టు ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ సంతేకాలిచ్చాడు.
CSK Vs MI | ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబయి ఇండియన్స్‌తో మ్యాచ్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బిగ్ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్‌కు స్టార్ పేసర్ మతీషా పతిరనా అందుబాటులో ఉండే అవకాశం లేదని ఆ జట్టు ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ సంతేకాలిచ్చాడు. గాయం తీవ్రత తగ్గినప్పటికీ.. ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉండకపోవచ్చని ఫ్లెమింగ్ తెలిపాడు. ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సీఎస్కే కోచ్ మాట్లాడుతూ.. ముంబయి ఇండియన్స్‌తో మ్యాచుకు పతిరనా ఆడుతాడనే ఆశాభావంతోనే ఉన్నామని.. అతడు వందశాతం ఫామ్‌లో ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు.
మ్యాచ్‌కు ఈ మ్యాచ్‌కి అందుబాటులో లేకపోయినా.. మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నట్లు కోచ్ తెలిపారు. మతీషా పతిరనా ప్రాధాన్యతం తమకు తెలుసునని చెప్పాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌ల్లో పతిరనా అందుబాటులో లేకపోవడంపై ప్రశ్నించగా సీఎస్కే సమాధానం ఇచ్చాడు. ఈ సందర్భంగా సీఎస్కే కొత్త కెప్టెన్ రుతురాజ్‌పై ఫ్లెమింగ్ ప్రశంసలు కురిపించాడు.
గైక్వాడ్, ధోనీల మధ్య పెద్దగా ఏం తేడా లేదని.. గైక్వాడ్ సైతం కూల్‌గా ఉంటున్నాడని చెప్పాడు. ఆదివారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లు వాంఖడే స్టేడియం వేదికగా తలపడనున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఇరుజట్లు 36 మ్యాచుల్లో తలపడగా.. ముంబయి 20, చెన్నై 16 సార్లు విజయం సాధించాయి. చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ ఇప్పటి వరకు ఐదు మ్యాచులు ఆడింది. ఇందులో మూడు విజయాలు, రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్నది. చివరి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై విజయం సాధించిచగా.. సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమిపాలైంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

