ఇండోర్: భారత్‌తో జరిగిన మూడవ టెస్టులో ఆస్ట్రేలియా (Australia)సునాయస విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆతిథ్య జట్టు 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే మూడవ రోజు ఓ ఆసక్తికర ఘటన జరిగింది. స్పిన్నర్ అశ్విన్(Ashwin) ఆడిన మైండ్ గేమ్స్‌కు ఆసీస్ బ్యాటర్ లబుషేన్(Labuschagne) గట్టి కౌంటర్ ఇచ్చాడు. చాలా స్వల్ప టార్గెట్‌తో రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న ఆసీస్‌ను అశ్విన్ ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేశాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్లో లబుషేన్ స్ట్రయిక్‌లో ఉన్న సమయంలో.. అశ్విన్ తన రనప్‌ను షార్ట్ చేశాడు. ఆ ఓవర్ నాలుగో బంతిని అతను కేవలం రెండు స్టెప్పుల్లోనే వేయాలనుకున్నాడు. అయితే స్ట్రయికింగ్‌లో ఉన్న లబుషేన్ .. అశ్విన్ ఒక అడుగు వేయగానే అతను పక్కకు జరిగిపోయాడు. అశ్విన్ వేసిన ఎత్తుకు .. లబుషన్ తనదైన స్టయిల్లో కౌంటర్ ఇచ్చాడు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ, అంపైర్ జో విల్సన్‌లు .. బ్యాటర్ లబుషేన్‌ను ఒప్పించే ప్రయత్నం చేశారు. చివరికు లబుషేషన్ స్ట్రయిక్ తీసుకోగానే.. అశ్విన్ మళ్లీ తన ఫుల్ రనప్‌తో బౌలింగ్ చేశాడు.
— Anna 24GhanteChaukanna (@Anna24GhanteCh2) March 3, 2023