Sachin Tendulkar | టాప్ టెస్ట్ బ్యాటర్.. భారత లెజెండ్ గురించి ఏమన్నాడంటే?
ప్రపంచ క్రికెట్లో పరిచయం అక్కర్లేని పేరు సచిన్ టెండూల్కర్. క్రికెట్ గాడ్‌గా అభిమానులు పిలుచుకునే ఈ ప్లేయర్.. క్రికెట్లో ఎన్ని రికార్డులు సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ ఎంతో మంది యువకులకు సచినే స్ఫూర్తి అనడం
ప్రపంచ క్రికెట్లో పరిచయం అక్కర్లేని పేరు సచిన్ టెండూల్కర్. క్రికెట్ గాడ్‌గా అభిమానులు పిలుచుకునే ఈ ప్లేయర్.. క్రికెట్లో ఎన్ని రికార్డులు సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ ఎంతో మంది యువకులకు సచినే స్ఫూర్తి అనడం అతిశయోక్తేమీ కాదు. ఇదే విషయాన్ని ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్, టెస్టుల్లో నెంబర్ వన్ ఆటగాడు మార్నస్ లబుషేన్ మరోసరి రుజువు చేశాడు.
ట్విట్టర్లో తన అభిమానులతో ప్రశ్నోత్తరాల సెషన్ నిర్వహించాడీ స్టార్ ఆటగాడు. ఈ సమయంలోనే ఒక ఫ్యాన్.. ‘సచిన్ బ్యాటింగ్ గురించి మీ అభిప్రాయం?’ అని అడిగాడు. దీనికి బదులిచ్చిన లబుషేన్.. ‘ఇప్పటికీ సచిన్ బ్యాటింగ్ చేసిన పాత వీడియోలు చూస్తుంటా. అద్భుతమైన టెక్నిక్. సచిన్ ఆడే విధానం నుంచి ఎంతో నేర్చుకునే అవకాశం ఉంది’ అని చెప్పాడు.
కాగా, ప్రస్తుతం లబుషేన్.. ఆస్ట్రేలియా జట్టుతోపాటు పాకిస్తాన్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. ఇటీవలే పాక్ టూర్‌కు వెళ్లేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా అంగీకరించిన సంగతి తెలిసిందే. 1998లో చివరగా ఆసీస్ జట్టు పాకిస్తాన్ పర్యటనకు వెళ్లింది. మళ్లీ ఇప్పుడు పాక్ టూర్‌కు వెళ్తోంది. ఈ టూర్ కోసం తను చాలా ఉత్సాహంగా ఉన్నట్లు లబుషేన్ చెప్పాడు.
still love watching old footage of @sachin_rt bat now. unbelievable technique, so much to learn from how he played the game.
— Marnus Labuschagne (@marnus3cricket) February 4, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

