Sourav Ganguly biopic | దాదాపై బయోపిక్.. నిర్మించనున్న లవ్ ఫిల్మ్స్

కోల్‌కతా: ఇండియన్ టీమ్ మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ జీవితచరిత్ర ( Sourav Ganguly biopic ) తెరకెక్కనుంది. లవ్ ఫిల్మ్స్ ( Luv Films ) ఈ మూవీని తెరకెక్కించనుంది. మహారాజ ఆఫ్ ఇండియన్ క్రికెట్‌గా పేరుగాంచిన ఈ లెజెండరీ క్రికెటర్ బయోపిక్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో తన బయోపిక్కు దాదా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ సినిమాను తామే నిర్మిస్తున్నట్లు లవ్ ఫిల్మ్స్ గురువారం ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. ఇది తమకు గొప్ప గౌరవమని, గ్రేట్ ఇన్నింగ్స్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు చెప్పింది.
అటు దాదా కూడా తన బయోపిక్‌పై ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించాడు. తన జీవితంలో క్రికెటే సర్వస్వమని, తాను తలెత్తుకొని జీవించడానికి అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని ఈ గేమే తనకు అందించిందని దాదా అన్నాడు. ఇండియా మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్లలో ఒకడిగా పేరుగాంచిన గంగూలీ.. రెండు దశాబ్దాల పాటు తన సొగసరి బ్యాటింగ్‌తోనూ అభిమానులను అలరించాడు. ఇప్పటికే సచిన్, ధోనీలపై బయోపిక్‌లు రాగా.. కపిల్దేవ్పై తెరకెక్కిన 83 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

