Luis Rubiales: మహిళా ఫుట్‌బాల్ ప్లేయర్‌కు లిప్ కిస్.. ఫెడరేషన్‌కు అధ్యక్షుడి రాజీనామా
Luis Rubiales: పెదవులపై ముద్దాడిన ఘటనలో.. స్పానిష్ ఫుట్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు ఇవాళ రాజీనామా సమర్పించారు. జెన్ని హెర్మోసోకు కిస్ ఇచ్చిన ఘటన పెను దుమారం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ కేసులో లూయిస్ రూబియేల్స్ తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు.
మాడ్రిడ్: మహిళల వరల్డ్‌కప్ ఫైనల్ తర్వాత జరిగిన ప్రజెంటేషన్ సెర్మనీ సమయంలో.. స్పెయిన్ క్రీడాకారిని జెన్ని హెర్మోసోకు ఆ దేశ ఫుట్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు లూయిస్ రూబియేల్స్(Luis Rubiales) లిప్ కిస్ ఇచ్చాడు. ఆ ఘటన పెను వివాదానికి దారి తీసింది. రూబియేల్స్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. పెదవిపై ముద్దాడిన ఘటన తనను బాధించినట్లు ఆ మహిళా ప్లేయర్ పేర్కొన్నది. కానీ సమాఖ్య నుంచి తప్పుకునేందుకు రూబియేల్స్ నిరాకరించారు. అయితే ఈ ఘటనపై స్పెయిన్ ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో ఆదివారం స్పెయిన్ ఫుట్‌బాల్ సమాఖ్య అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు రూబియేల్స్ ప్రకటించారు. తాత్కాలిక అధ్యక్షుడు పెడ్రో రోచాకు తన రాజీనామాను అందజేసినట్లు ఆయన తెలిపారు.
33 ఏళ్ల హెర్మోసోకు స్టేజ్‌పై లిప్ కిస్ ఇవ్వడం స్పెయిన్‌లో తీవ్ర చర్చకు దారితీసింది. ఆ దేశం వరల్డ్‌కప్ గెలిచినా.. దానికి గురించి పెద్దగా చర్చించిన సందర్భమే లేకుండా పోయింది. రాజీనామా చేయాలని ఎంత వత్తిడి తెచ్చినా రూబియేల్స్ పట్టించుకోలేదు. దీంతో ఆ లిప్ వివాదంపై హెర్మోస్ కోర్టును ఆశ్రయించారు. లీగల్ కేసును దాఖలు చేయడంతో.. తన పదవికి రాజీనామా చేసేందుకు చివరకు అతను అంగీకరించాడు. ఇష్టపూర్వకంగానే హెర్మోస్కు కిస్ ఇచ్చినట్లు రూబియేల్స్ పేర్కొన్నా.. అది తన అంగీకారం లేకుండా జరిగినట్లు ఆ క్రీడాకారిణి ఆరోపించారు.
రూబియేల్స్ అధ్యక్షుడిగా ఉంటే.. తాము దేశం కోసం ఆడబోమని 23 మంది వరల్డ్ కప్ ప్లేయర్లతో పాటు మరో 81 మంది స్పెయిన్ క్రీడాకారిణిలు తెలిపారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

