KKR vs LSG | టాస్ గెలిచిన లక్నో.. గ్రీన్ మెరుపులు చూస్తామా..!
KKR vs LSG : పంతొమ్మిదో సీజన్లో బోణీ కోసం నిరీక్షిస్తున్న కోల్‌కతా నైట్ రైడర్స్ సొంత మైదానంలో మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. వర్ష సూచన భయాల నడుమ లక్నో సూపర్ జెయింట్స్‌తో కోల్‌కతా తలపడుతోంది.
KKR vs LSG : పంతొమ్మిదో సీజన్లో బోణీ కోసం నిరీక్షిస్తున్న కోల్‌కతా నైట్ రైడర్స్ సొంత మైదానంలో మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. వర్ష సూచన భయాల నడుమ లక్నో సూపర్ జెయింట్స్‌తో కోల్‌కతా తలపడుతోంది. టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ బౌలింగ్ తీసుకున్నాడు. గత మూడు మ్యాచుల్లో టాపార్డర్ వైఫల్యంతో కుదేలైన కేకేఆర్ ఈసారి భారీ స్కోర్‌తో ప్రత్యర్థిని ఒత్తిడిలో పడేయాలని భావిస్తోంది. తీవ్రంగా నిరాశపరుస్తున్న కామెరూన్ గ్రీన్ ఈ మ్యాచ్‌లో సత్తా చాటాలనే కసితో ఉన్నాడు.
మినీ వేలంలో రికార్డు ధర పలికిన కామెరూన్ గ్రీన్ వైఫల్యం కోల్‌కతా నైట్ రైడర్స్‌ను వేధిస్తోంది. మూడు మ్యాచుల్లో తేలిపోయిన గ్రీన్.. లక్నోపై చెలరేగాలని యాజమాన్యం భావిస్తోంది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి లక్నోతో ఆడుతాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
🚨 Toss 🚨@LucknowIPL won the toss and elected to bowl first against @KKRiders
Updates ▶️ https://t.co/ov5gAlAtPH #TATAIPL | #KhelBindaas | #KKRvLSG pic.twitter.com/lUmM8nQLo5
— IndianPremierLeague (@IPL) April 9, 2026
ఆరంభ మ్యాచ్‌లో 220 కొట్టినా ముంబై ఇండియన్స్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓడింది కోల్‌కతా. సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ల విజృంభణతో 161 పరుగులకే ఆలౌటైన కేకేర్ రెండో ఓటమి చవి చూసింది. మూడో మ్యాచ్ వర్షార్పణం కావడంతో పంజాబ్ కింగ్స్‌తో పాటు ఒక పాయింట్ పంచుకుంది అజింక్యా రహానే జట్టు.
కోల్‌కతా తుది జట్టు : అజింక్యా రహానే(కెప్టెన్), ఫిన్ అలెన్, కామెరూన్ గ్రీన్, రఘువంశీ(వికెట్ కీపర్), రింకూ సింగ్, రొవ్మన్ పావెల్, రమన్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, నవ్‌దీప్ సైనీ, కార్తిక్ త్యాగి.
ఇంప్యాక్ట్ సబ్స్ – మనీశ్ పాండే, వైభవ్ అరోరా, తేజస్వీ దహియా, రాహుల్ త్రిపాఠి, టిమ్ సీఫర్ట్.
లక్నో తుది జట్టు : మిచెల్ మార్ష్, ఎడెన్ మర్క్రమ్, రిషభ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), పూరన్, సమద్, ముకుల్ చౌదరీ, మనిమరన్ సిద్దార్థ్, అవేశ్ ఖాన్, షమీ, రథీ, ప్రిన్స్ యాదవ్.
ఇంప్యాక్ట్ సబ్స్ – ఆయుశ్ బదొని, మాథ్యూ బ్రీట్జ్, షెహబాజ్ అహ్మద్, మయాంక్ యాదవ్, హిమ్మత్ సింగ్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

