Mukul Choudhary : ఒకేఒక్క ఇన్నింగ్స్‌తో ఐపీఎల్ స్టార్‌గా అవతరించాడు ముకుల్ చౌదరీ(Mukul Choudhary). ఈడెన్ గార్డెర్స్లో ఓటమి అంచున నిలిచిన లక్నో సూపర్ జెయింట్స్ (LSG)ను ఒంటిచేత్తో గెలిపించాడీ కుర్రాడు. మూడు ఐపీఎల్ మ్యాచుల అనుభవం మాత్రమే ఉన్న ముకుల్.. ఏడు సిక్సర్లు, సూపర్ అర్ధ శతకంతో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) నుంచి విజయాన్ని లాగేసుకున్నాడు. నమ్మశక్యంకాని విధ్వంసంతో లక్నో అభిమానులను ఉర్రూతలూగించిన ఈ యంగ్‌స్టర్ మ్యాచ్ అనంతరం తనను క్రికెటర్‌గా చూడడం కోసం తన తండ్రి పడిన బాధలు, కష్టాలను వెల్లడించాడు.
ఐపీఎల్లో నయా ఫినిషర్‌గా ముకుల్ చౌదరీ పేరు మార్మోగుతోంది. మ్యాచ్ చేజారుతున్న వేళ క్రీజులోకి వచ్చిన ముకుల్.. సిక్సర్ల మోతతో లక్నో సూపర్ జెయింట్స్‌ను గెలిపించిన తీరును క్రికెట్ దిగ్గజాలు ప్రశంసిస్తున్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఈ కుర్రాడు మాత్రం ఇదంతా ఒక్కరోజులో సాధ్యపడలేదని.. ఈ రోజుకోసం తాను కొన్ని నెలలుగా సాధన చేశానని మ్యాచ్ అనంతరం వెల్లడించాడు.
Mukul Choudhary was well-prepared to steal the spotlight 💪 pic.twitter.com/tNKIJEaiAq
— ESPNcricinfo (@ESPNcricinfo) April 10, 2026
Mukul Choudhary dedicated his yesterday’s knock to his father and his idol MS Dhoni. 🥹❤️ pic.twitter.com/WGkGKQ9dvi
— ` (@WorshipDhoni) April 10, 2026
‘నా శరీరం సహజంగానే శక్తివంతమైనది. రోజుకు 100 నుంచి 150 సిక్సర్లు కొట్టడం ప్రాక్టీస్ చేసేవాడిని. రోజు ఇలా సిక్సర్లు కొట్టడం సాధన చేయడంతో నా బ్యాట్ వేగం కూడా మెరుగుపడింది. గత ఆరు నెలలుగా నా దినచర్య ఇదే. ఈరోజు నా కష్టానికి తగ్గ ఫలితం దొరికింది’ అని తాను మ్యాచ్ విన్నర్‌గా, ఫినిషర్‌గా అవతరించిన తీరును వెల్లడించాడు ముకుల్. అంతేకాదు తనను క్రికెటర్‌గా చూడడం కోసం తండ్రి దిలీప్ చౌదరీ ఎన్నో ఆర్ధిక కష్టాలు అనుభవించాడని ముకుల్ తెలిపాడు.
‘నా కెరీర్ కోసం నాన్న చాలా ఇబ్బందులు పడ్డాడు. మా ఇల్లు అమ్మగా రూ.21 లక్షలు వచ్చాయి. నాన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం.. హోటల్ వ్యాపారం చేశాడు. నన్ను అకాడమీలో చేర్చిన తర్వాత లోన్లకు ఈఎంఐ కట్టలేక జైలుకు వెళ్లొచ్చాడు. కానీ, ఇప్పుడు అంతా మారిపోయింది. ఈ ఇన్నింగ్స్‌ను ధోనీకి, నాన్నకు అంకితం చేస్తున్నా’ అని ఈ మ్యాచ్ విన్నర్ వెల్లడించాడు.
Mukul Choudhary was well-prepared to steal the spotlight 💪 pic.twitter.com/tNKIJEaiAq
— ESPNcricinfo (@ESPNcricinfo) April 10, 2026
కోల్‌కతా నిర్దేశించిన 182 పరుగుల ఛేదనలో ఒకేఓవర్లో ఓపెనర్లు మర్క్రమ్(22), మిచెల్ మార్ష్(15)ను ఔట్ చేసిన వైభవ్ అరోరా లక్నోను దెబ్బకొట్టాడు. కాసేపటికే రిషభ్ పంత్(10)ను గ్రీన్ బోల్తా కొట్టించగా.. పూరన్(15) సైతం విఫలమయ్యాడు. ఆ దశలో ఇంప్యాక్ట్ సబ్ ఆయుశ్ బదొని(54) అర్ధ శతకంతో ఆశలు రేపినా అనుకుల్ రాయ్ అతడిని ఔట్ చేసి మ్యాచ్‌లను కోల్‌కతా వైపు తిప్పాడు.
Mukul maar raha hai ❤️💙 pic.twitter.com/rzjglonszO
— Lucknow Super Giants (@LucknowIPL) April 9, 2026
18వ ఓవర్ వరకూ విజయం కేకేఆర్‌దే అనిపించింది. కానీ, ముకేల్ చౌదరీ(54 నాటౌట్) ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. గ్రీన్, వైభవ్ ఓవర్లో సిక్సర్లు, ఫోర్లతో రెచ్చిపోయిన అతడు.. చివరి బంతికి సింగిల్‌తో లక్నోకు చిరస్మరణీయ విజయాన్ని కట్టబెట్టాడు.