కామన్వెల్త్కు నిఖత్ జరీన్
- సత్తాచాటిన తెలంగాణ బాక్సర్
- ఏకపక్ష విజయాలతో విజృంభణ
- లవ్లీనా, నీతు, జాస్మిన్‌కు బెర్తులు
ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్.. మరో ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌కు అర్హత సాధించింది. అంతర్జాతీయ వేదికలపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఈ తెలంగాణ యువ బాక్సర్ వచ్చే నెలలో జరుగనున్న బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో బరిలోకి దిగనుంది. సెలెక్షన్ ట్రయల్స్‌లో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన ఈ ఇందూరు అమ్మాయి రింగ్‌లో కొదమ సింహంలా గర్జిస్తూ కామన్వెల్త్ బెర్త్ పట్టేసింది. మోకాలి గాయం కారణంగా ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ మేరీకోమ్ ఈ మెగాటోర్నీకి దూరం కాగా.. టోక్యో కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహై కూడా స్థానం పదిలం చేసుకుంది.
న్యూఢిల్లీ: తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్.. వచ్చే నెలలో బర్మింగ్‌హామ్ వేదికగా జరుగనున్న ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ క్రీడలకు అర్హత సాధించింది. శనివారం జరిగిన సెలక్షన్ ట్రయల్స్ ఫైనల్లో నిఖత్ (50 కేజీలు) 7-0తో హర్యానా బాక్సర్ మీనాక్షిని చిత్తు చేసి మెగాటోర్నీ బెర్తు ఖరారు చేసుకుంది. ఇటీవల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో అదిరిపోయే ప్రదర్శనతో జగజ్జేతగా నిలిచిన నిఖత్.. ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన క్వాలిఫయింగ్ ఈవెంట్లోనూ సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది.
టోక్యో కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహై 70 కేజీల ఫైనల్లో పూజాపై విజయం సాధించి కామన్వెల్త్ క్రీడల్లో చోటు ఖాయం చేసుకుంది. గాయం కారణంగా ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ మేరీకోమ్ ట్రయల్స్ నుంచి తప్పుకోగా.. 48 కేజీల విభాగంలో నీతు, 60 కేజీల ఈవెంట్లో జాస్మిన్ లాంబొరియా.. బర్మింగ్‌హామ్ క్రీడలకు అర్హత సాధించారు. జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు ఈ మెగా ఈవెంట్ జరుగనుంది. 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా బాక్సర్‌గా రికార్డుల్లోకెక్కిన మేరీకోమ్ గైర్హాజరీలో నిఖత్, లవ్లీనాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
దాంట్లో సగం కూడా కాదు..
బౌట్ ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యం కనబర్చిన నిఖత్.. రింగ్ మొత్తం కలియ తిరుగుతూ ప్రత్యర్థిపై పంచ్‌ల వర్షం కురిపించింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకం నెగ్గాక సన్మానాలు, ప్రత్యేక కార్యక్రమాలతో బిజీబిజీగా గడిపిన నిఖత్ సరైన సన్నాహం లేకున్నా తుదిపోరులో దుమ్మురేపింది. ‘వరల్డ్ చాంపియన్‌షిప్ తర్వాత సన్నాహకాల్లో పాల్గొనలేదు. పలు కార్యక్రమాల వల్ల ప్రాక్టీస్‌కు సమయం కేటాయించలేకపోయా. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పడ్డ శ్రమతో పోల్చుకుంటే 50 శాతం కూడా కష్టపడకుండానే కామన్వెల్త్కు అర్హత సాధించగలిగా.

సెలెక్షన్ ట్రయల్స్‌లో అన్నీ బౌట్లలో ఏకపక్ష విజయాలే నమోదు చేసుకున్నా’అని బౌట్ అనంతరం నిఖత్ పేర్కొంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 52 కేజీల విభాగంలో పోటీపడిన నిఖత్ తాజాగా 50 కేజీల్లో బరిలోకి దిగింది. కొత్త వెయిట్ కేటగిరీలో మారడం కాస్త ఇబ్బందిగా ఉందన్న నిఖత్.. దీనిపై మరింత దృష్టి పెడుతానని పేర్కొంది. స్ట్రాంజా మెమోరియల్ టోర్నీల్లో రెండు స్వర్ణాలు నెగ్గిన నిఖత్ మాట్లాడుతూ.. ‘ఇది నా వెయిట్ కేటగిరీ కాదు. ఈ విభాగంలో ఫిట్నెస్ లెవల్స్ సాధించేందుకు ఎంతో శ్రమించా. సామర్థ్యం, స్పీడ్ పవర్‌పై ఇంకా కసరత్తు చేయాల్సి ఉంది’అని చెప్పింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

