Lionel Messi : ఫుట్‌బాల్ లెజెండ్ లియోనల్ మెస్సీ(Lionel Messi) పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మియామి సిటీ(Miami City)లో ట్రాఫిక్ జంక్షన్ వద్ద మెస్సీ సిగ్నల్ జంప్ చేశాడు. రెడ్ లైట్ పడింది చూసుకోకుండా ఈ అర్జెంటీనా స్టార్ కారును ముందుకు కదిలించాడు. అదే సమయంలో అవతలి వైపు నుంచి వాహనాలు రావడంతో మెస్సీ కారు యాక్సిడెంట్‌కు గురవుతుందనిపించింది.
కానీ, అది గమనించిన ఫ్లోరిడా పోలీసులు(Floida Police) మెస్సీ కారుకు ప్రమాదం జరగకుండా చూశారు. ఎస్కార్ట్‌గా ఉండి అతడి కారును సురక్షితంగా సిగ్నల్ దాటించారు. దాంతో, ఈ స్టార్ ఫుట్‌బాలర్ ‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకున్నాడు. మెస్సీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న వీడియో మొదట అర్జెంటీనా టీవీ చానెల్ టైసీ స్పోర్ట్స్(TyC Sports)లో వచ్చింది. క్షణాల్లోనే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
🚨 | Messi went through a red light. 😭Luckily he was being escorted home by a Florida State Police car.
— FCB Albiceleste (@FCBAlbiceleste) July 14, 2023
వరల్డ్ కప్ హీరో మెస్సీ ఈమధ్యే అమెరికాకు చెందిన ఇంటర్ మియామి(Inter Miami) క్లబ్‌కు మారాడు. త్వరలోనే అతను మేజర్ సాకర్ లీగ్ తరఫున తొలి మ్యాచ్ ఆడనున్నాడు. పీఎస్జీ క్లబ్(PSG Club)తో రెండేళ్ల కాంట్రాక్టు ముగియడంతో మెస్సీ మియామి క్లబ్‌కు మారాడు.
లియోనల్ మెస్సీ
అయితే.. అతడితో కాంట్రాక్ట్ కుదుర్చుకునేందుకు బార్సిలోనా, సౌదీ అరేబియాకు చెందిన అల్ హిలాల్(Al Hilal) క్లబ్స్ పోటీ పడ్డాయి. కానీ, మెస్సీ మియామి క్లబ్‌కు ఓకే చెప్పాడు.