Legends League | వందేభారత్ ఎక్స్ప్రెస్లో లెజెండ్స్ లీగ్ క్రికెట్ కప్ ప్రయాణం..!
Legends League | లెజెండ్స్ లీగ్ క్రికెట్ రెండో ఎడిషన్ ఈ నెల 18న ప్రారంభం షురూ కానున్నది. డిసెంబర్ 9 వరకు కొనసాగనున్నది. వెటరన్ క్రికెట్ మరోసారి మైదానంలోకి దిగి క్రికెట్ అభిమానులను అలరించబోతున్నారు.
Legends League | లెజెండ్స్ లీగ్ క్రికెట్ రెండో ఎడిషన్ ఈ నెల 18న ప్రారంభం షురూ కానున్నది. డిసెంబర్ 9 వరకు కొనసాగనున్నది. వెటరన్ క్రికెట్ మరోసారి మైదానంలోకి దిగి క్రికెట్ అభిమానులను అలరించబోతున్నారు. దేశంలోని ఐదు నగరాల్లో టోర్నీ సాగనున్నది. ఇందులో జమ్మూ, రాంచీ, డెహ్రాడూన్, వైజాగ్, సూరత్ ఉన్నాయి. అయితే, భారత్లో క్రీడలను మరింత ప్రోత్సహించేందుకు వందే భారత్తో లెజెండ్స్ లీగ్ భాగస్వామ్యం కుదురుకున్నది.
ఇందులో భాగంగా వందే భారత్ ఎక్స్ప్రెస్లో లెజెండ్స్ క్రికెట్ కప్ బుధవారం నుంచి 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రయాణించనున్నది. దాదాపు పక్షం రోజుల పాటు నార్త్, సౌత్, సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ రైల్వేజోన్ల మీదుగా వందే భారత్ రైలు ప్రయాణించనున్నది. వందేభారత్కు, దిగ్గజ ఆటగాళ్లను స్వాగతిస్తున్నామని, దేశవ్యాప్తంగా క్రీడలను ప్రోత్సహించే ఈ అద్భుతమైన ప్రయాణం కోసం ఎదురుచూస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.
లెజెండ్స్ లీగ్ క్రికెట్ కమిషనర్ రవిశాస్త్రి మాట్లాడుతూ భారతీ రైల్వేతో భాగస్వామ్యం కావడం, క్రీడల ప్రోత్సాహానికి దోహదపడడం గర్వకారణమన్నారు. లీగ్ సీఈవో రామన్ రహేజా మాట్లాడుతూ అభిమానులకు అత్యుత్తమ క్రీడా అనుభవాన్ని అందించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. దేశంలోని ప్రతి మూలల్లో క్రీడా సంస్కృతిని పెంపొందించడానికి ఇది ఒక ప్రత్యేకమైన కార్యక్రమమన్నారు.
ఇదిలా ఉండగా.. ఈ నెల 18న లెజెండ్స్ లీగ్ టోర్నమెంట్ మొదలుకానుండగా.. ఆరు జట్లు పాల్గొంటాయి. ఇందులో ఇండియా క్యాపిటల్స్, మణిపాల్ టైగర్స్, గుజరాత్ జెయింట్స్, అర్బన్ రైజర్స్ హైదరాబాద్, సదరన్ సూపర్ స్టార్స్, భిల్వారా కింగ్స్ జట్లు పోటీ పడనున్నాయి. ఇందులో గౌతమ్ గంభీర్, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, క్రిస్ గేల్, కెవిన్ పీటర్సన్, ఎస్ శ్రీశాంత్, పార్థివ్ పటేల్, షేన్ వాట్సన్, ప్రవీణ్ కుమార్, ఝులన్ గోస్వామి తదితర దిగ్గజ క్రికెటర్లు భాగస్వాములు కానున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

