Muhammad Ali | హాల్ ఆఫ్ ఫేమ్ క్లాస్‌లో ‘బాక్సింగ్ గ్రేట్’.. మరణం తర్వాత దక్కిన గౌరవం
Muhammad Ali : బాక్సింగ్ దిగ్గజాల్లో ఒకడైన దివంగత మహమ్మద్ అలీ(Muhammad Ali)కి అరుదైన గౌరవం దక్కింది. గొప్ప బాక్సర్‌గా పేరొందిన అలీకి 'హాల్ ఆఫ్ ఫేమ్ క్లాస్ 2024'(Hall Of Fame Class)లో చోటు కల్పించనుంది. మరణం తర్వాత అతడికి ఈ...
Muhammad Ali : బాక్సింగ్ దిగ్గజాల్లో ఒకడైన దివంగత మహమ్మద్ అలీ(Muhammad Ali)కి అరుదైన గౌరవం దక్కింది. గొప్ప బాక్సర్‌గా పేరొందిన అలీకి ‘హాల్ ఆఫ్ ఫేమ్ క్లాస్ 2024′(Hall Of Fame Class)లో చోటు కల్పించనుంది. మరణం తర్వాత అతడికి ఈ గౌరవం దక్కింది. ఏప్రిల్ 5న జరిగే కార్యక్రమంలో డబ్ల్యూడబ్ల్యూఈ అలీ పేరును ఈ ఏడాది హాల్ ఆఫ్ ఫేమ్ క్లాస్‌లో చేర్చనుంది. ఫిలడెల్ఫియాలో జరుగనున్న ఈ ప్రత్యేక కార్యక్రమంలో అతడి భార్య లొన్నే అలీ(Lonnie Ali) పాల్గొననుంది.
మొత్తంగా ఈ ఘనత సాధించిన ఐదో అమెరికా బాక్సర్‌గా అలీ పేరు చరిత్రపుటల్లో నిలిచిపోనుంది. అలీ కంటేముందు పాల్ హేమన్(Paul Heyman), బుల్ నకానోలు, మైక్ రోటుండా, బారీ వింధామ్లు డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్ ఫేమ్ క్లాస్‌లో చోటు దక్కించుకున్నారు.
అలీ అమెరికాకు చెందిన ప్రొఫెషనల్ బాక్సర్. అతడు 1976లో ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్లోఅంటోనియో ఇనోకితో తలపడ్డాడు. ఆ తర్వాత అలీ పంచ్‌కు ఎదురన్నదే లేకుండా పోయింది. ప్రపంచంలోని మేటి బాక్సర్లలో ఒకడైన అతడు 1964 నుంచి 1970ల మధ్య తన హవా చూపించాడు. రింగ్ మ్యాగజైన్ హెవీవెయిట్ టైటిల్ గెలుపొందాడు. రింగ్‌లో ప్రత్యర్థులను అలవోకగా చిత్తు చేసి గ్రేటెస్ట్‌గా ప్రశంసలు అందుకున్న అలీ 2016లో ప్రాణాలు విడిచాడు. ఇన్ఫెక్షన్ కారణంగా అతడి బీపీ పడిపోవడంతో ఈ బాక్సింగ్ లెజెండ్ 74 ఏండ్ల వయసులో కన్నుమూశాడు.
ఇవి కూడా చదవండి
- Defamation Case: కేంద్ర మంత్రిపై పరువునష్టం కేసు కొట్టివేత
- Cristiano Ronaldo | ఓటమి బాధ ఎవరికైనా ఒకటేగా.. వలవలా ఏడ్చిన ఫుట్‌బాల్ దిగ్గజం
- Haiti PM | సాయుధ మూకల దాడులతో అట్టుడుకుతున్న హైతీ.. రాజీనామా చేసిన ప్రధాని ఏరియెల్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

