Lanka Premier League 2023 | రేపటితో లంక ప్రీమియర్ లీగ్ షురూ.. చితక్కొట్టనున్న ఐపీఎల్ స్టార్స్
Lanka Premier League 2023 : లంక ప్రీమిర్ టీ20 లీగ్ నాలుగో సీజన్(LPL Fourth Season)కు కౌంట్‌డౌన్ మొదలైంది. రేపటితో శ్రీలంక గడ్డపై అట్టహాసంగా లీగ్‌కు తెర లేవనుంది. 21 రోజుల పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను అలరించనుంది. ఈమధ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2023)లో దుమ్మురేపిన అంతర్జాతీయ క్రికెటర్లు మరోసారి తమ మెరుపు బ్యాటింగ్‌తో లంక స్టేడియాలను...
Lanka Premier League 2023 : లంక ప్రీమిర్ టీ20 లీగ్ నాలుగో సీజన్(LPL Fourth Season)కు కౌంట్‌డౌన్ మొదలైంది. రేపటితో శ్రీలంక గడ్డపై అట్టహాసంగా లీగ్‌కు తెర లేవనుంది. 21 రోజుల పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను అలరించనుంది. ఈమధ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2023)లో దుమ్మురేపిన అంతర్జాతీయ క్రికెటర్లు మరోసారి తమ మెరుపు బ్యాటింగ్‌తో లంక స్టేడియాలను హోరెత్తించనున్నారు. ఈ టోర్నమెంట్లో మొత్తం ఐదు జట్లు పోటీ పడుతున్నాయి. రౌండ్ – రాబిన్ ఫార్మాట్ (round-robin format)లో జరుగుతున్న ఈ టోర్నమెంట్ ఆగస్టు 21న ముగియనుంది. మరి, ఇంకెందుకాలస్యం ఈ లీగ్ షెడ్యూల్ ? మ్యాచ్ ఎక్కడ చూడాలి? వంటి వివరాలు తెలుసుకుందాం.
లంక ప్రీమిర్ టీ20 లీగ్‌లో కొలంబో స్ట్రయికర్స్(Colombo Strikers), గాలే టైటాన్స్(Galle Titans), దంబుల్లా ఆరా(Dambulla Aura), బి-లవ్ కాండీ(B-Love Kandy), జఫ్నా కింగ్స్(Jaffna Kings) జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. కొలంబ్ స్ట్రయికర్స్ జట్టుకు నిరోషన్ డిక్వెల్లా, దంబుల్లా అరాకు కుశాల్ మెండిస్ కెప్టెన్.
ట్రోఫీతో ఐదు జట్ల కెప్టెన్లు

గాలే టైటాన్స్‌కు దసున్ శనక, బి-లవ్ కాండీకి వనిందు హసరంగ, జఫ్నా కింగ్స్ జట్టుకు తిషారా పెరీరీ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఈ టోర్నమెంట్ మ్యాచ్‌లన్నీ కొలంబో, కాండీ స్టేడియాల్లో జరుగనున్నాయి. లైవ్ స్ట్రీమింగ్ మాత్రం స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌తో పాటు ఫ్యాన్‌కోడ్ యాప్‌లో చూసేందుకు వీలుంది.
ప్లే ఆఫ్స్‌కు 4 జట్లు
డేవిడ్ మిల్లర్(David Miller), బాబార్ ఆజాం(Babar Azam), క్రిస్ లిన్(Chris Lynn), షకిబుల్ హసన్(Shakib Al Hasan) వంటి ఇంటర్నేషనల్ స్టార్స్ ఈ లీగ్‌లో ఆడుతున్నారు. లంక క్రికెటర్లు మహేశ్ థీక్షణ, భానుక రాజపక్స, యాంజెలో మాథ్యూస్ కూడా సత్తా చూపేందుకు తహతహలాడుతున్నారు.
బాబార్ ఆజాం, డేవిడ్ మిల్లర్

గ్రూప్ స్టేజీలో ప్రతి జట్టు ఒక్కో జట్టుతో రెండు మ్యాచ్‌లు ఆడుతుంది. పాయింట్ల పట్టికలో టాప్ -4లో ఉన్న జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి. ఆగస్టు 17న ప్లే ఆఫ్స్ పోటీలు, ఫైనల్ మ్యాచ్ 20న ఉంటుంది. ఒకవేళ వర్షం అంతరాయం కలిగిస్తే ఆగస్టు 21 రిజర్వ్ డేన ఫైనల్ నిర్వహిస్తారు.
ఇవి కూడా చదవండి
ODI WC 2023 | భారత్‌లో ఐసీసీ బృందం.. వరల్డ్ కప్ స్టేడియాలపై ఆరా తీసేందుకేనా..?
Lakshya Sen | జపాన్ ఓపెన్ టోర్నీ నుంచి లక్ష్యసేన్ నిష్క్రమణ.. సెమీఫైనల్లో ఇండోనేషియా షట్లర్ చేతిలో ఓటమి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IL-76 Aircraft: చరిత్ర సృష్టించిన ఐఎల్-76 విమానం.. న్యోమా ఎయిర్‌ఫీల్డ్‌లో ల్యాండింగ్
Tholi Prema Katha | ‘తొలి ప్రేమ కథ’ థియేటర్లో చూడాల్సిన సినిమా.. టీజర్ అదుర్స్ : డైరెక్టర్ శైలేష్ కొలను!
Mamata Banerjee | రండి, మా పైనుంచే బుల్డోజర్లు నడపండి.. బెంగాల్ సర్కారుపై మమతాబెనర్జి ఫైర్..!
TB | టీబీ వ్యాధికి ఇక ఒకే ఒక్క ఇంజెక్షన్ చాలు.. సన్నాహాలు చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ..
KTR | ఎత్తిపోతల పథకం టెండర్లలోనూ మంత్రి పొంగులేటి కంపెనీకి అనుచిత లబ్ధి : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

