Champions Trophy 2025 | లాహోర్‌లో భారత్, పాక్ మ్యాచ్.. షెడ్యూల్ తెలుసా..?
Champions Trophy 2025 : ప్రపంచంలోనే గొప్ప క్రికెట్ సమరం ఈసారి పాకిస్థాన్ గడ్డపై జరుగనుంది. భారత్, పాకిస్థాన్ జట్లు చాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025)లో మరోసారి ఫ్యాన్స్‌ను మునివేళ్లపై నిలబెట్టనున్నాయి.
Champions Trophy 2025 : ప్రపంచంలోనే గొప్ప క్రికెట్ సమరం ఈసారి పాకిస్థాన్ గడ్డపై జరుగనుంది. న్యూయార్క్‌లో భారత్ (India), పాకిస్థాన్(Pakistan) జట్ల ఉత్కంఠ పోరాటాన్ని తనివితీరా ఆస్వాదించిన ఫ్యాన్స్.. మరో ఎనిమిది నెలల్లో మళ్లీ హై ఓల్టేజ్ మ్యాచ్ చూడనున్నారు. అవును.. భారత్, పాకిస్థాన్ జట్లు చాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025)లో మరోసారి ఫ్యాన్స్‌ను మునివేళ్లపై నిలబెట్టనున్నాయి.
వన్డే ఫార్మాట్లో జరిగే ఈ మెగా టోర్నీ2025 ఫిబ్రవరి 19 షురూ కానుంది. ఆరంభ పోరు, ఒక సెమీస్ మ్యాచ్ కరాచీలో.. రెండో సెమీఫైనల్‌కు రావల్పిండిలో జరుగనున్నాయి. చిరకాల ప్రత్యర్థులైన టీమిండియా, పాక్‌లు లాహోర్ వేదికగా తలపడనున్నాయి. అయితే.. అందుకు భారత క్రికెట్ బోర్డు అంగీకరించాల్సి ఉంటుంది. మార్చి 9న జరిగే ఫైనల్ ఫైట్‌కు కరాచీ వేదిక కానుంది.
📸🪙©️#INDvPAK | #T20WorldCup | #WeHaveWeWill pic.twitter.com/cIHtI46usb
— Pakistan Cricket (@TheRealPCB) June 9, 2024
బీసీసీఐ ‘ఓకే’ అంటేనే..
సరిహద్దు వివాదం కారణంగా భారత్, పాక్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు మూలనపడ్డాయి. కానీ, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) నిర్వహించే తటస్థ వేదికలపై ఇరుజట్లు తలపడుతున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టును పాక్‌కు పంపేందుకు బీసీసీఐ(BCCI) ససేమిరా అంటోంది. నిరుడు ఆసియా కప్ కోసం కూడా దాయది గడ్డపై టీమిండియా కాలు మోపలేదు.

అయితే.. భారత్ ఆతిథ్యమిచ్చిన వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ ఆడింది కాబట్టి ఈసారి మన జట్టు అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు సెమీస్‌కు అర్హత సాధిస్తే… ఆ మ్యాచ్‌ను కూడా లాహోర్‌లో నిర్వహించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB) సిద్ధంగా ఉంది. ఈసారి ఈ ట్రోఫీలో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి.15 మ్యాచ్‌ల తర్వాత ఫైనల్ బెర్తులు ఖరారవుతాయి.
ఇవి కూడా చదవండి
- Kesineni Nani | కేశినేని నాని సంచలన నిర్ణయం.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటన
- MCA | న్యూయార్క్‌లో ముంబై క్రికెట్ చీఫ్ మృతి.. కారణమిదే..!
- Traffic Jam | ట్యాంక్‌బండ్‌పై భారీగా ట్రాఫిక్‌జామ్.. గంట సేపటి నుంచి కదలని ఒక్క వాహనం..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
DK Aruna | భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతారా.. సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

