KTR | మంత్రి కేటీఆర్ సాయం.. చందుకు స్వర్ణం

హైదరాబాద్, జనవరి1: రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోమారు తన గొప్ప మనసు చాటుకున్నారు. అంతర్జాతీయ టోర్నీలో పోటీపడేందుకు డబ్బుల్లేవంటూ ఓ యువ కరాటే ప్లేయర్ చేసిన అభ్యర్థనకు మంత్రి తక్షణం స్పందించారు. వివరాల్లోకి వెళితే జనగామ జిల్లా బచ్చన్నపేటకు చెందిన బొలుగుల చందు.. ఐదో అంతర్జాతీయ నేపాల్ గేమ్స్‌లో బరిలోకి దిగాల్సింది. అయితే నేపాల్ వెళ్లేందుకు కావాల్సిన ఆర్థిక స్థోమత లేకపోవడంతో సమస్యను ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చాడు. వెంటనే స్పందించిన మంత్రి టోర్నీకి వెళ్లేందుకు రూ.25 వేలు సమకూర్చారు. వరంగల్‌లోని సైనిక్ కాలేజీలో ప్రస్తుతం డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న 19 ఏండ్ల చందు తాను పోటీకి దిగిన కుంగ్‌ఫూ లో స్వర్ణ పతకంతో సత్తాచాటాడు.
శనివారం జరిగిన ఫైనల్లో కొరియా ప్లేయర్‌పై చందు 5-4 తేడాతో అద్భుత విజయం సాధించాడు. అంతకుముందు జరిగిన తొలి రౌండ్లో భూటాన్ ప్లేయర్‌పై 5-3, సెమీఫైనల్లో నేపాల్ ప్లేయర్‌పై 5-3తో విజయాలు సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ వేదికపై దేశ, రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేసేలా రాణించిన చందు.. పసిడి పతకం దక్కించుకోవడంపై మాట్లాడుతూ..‘మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు. ఆయన చేసిన ఆర్థిక సాయం వల్లే నేపాల్‌కు వెళ్లగలిగాను. కచ్చితంగా రాణిస్తానన్న నమ్మకంతో బరిలోకి దిగాను. దేశం గర్వపడేలా పసిడి పతకంతో మెరువడం సంతోషంగా ఉంది’ అని అన్నాడు. గోవాలో జరిగిన జాతీయ టోర్నీలో రాణించడం ద్వారా నేపాల్ చాంపియన్‌షిప్‌నకు ఎంపికయ్యాడు. ఎనిమిదో ఏటనే కరాటేను ఎంచుకున్న చందు..మాస్టర్ శ్రీను శిక్షణలో రాటుదేలాడు. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా చందు పేర్కొన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

