KS Bharat | భారత్‌కు ఆడాలన్నది నా ఒక్కడి కల మాత్రమే కాదు : కేఎస్ భరత్
టీమిండియాకు ఆడాలన్నది తన ఒక్కడి కల కాదని కేఎస్ భరత్ అన్నాడు. నేను జాతీయ జట్టుకు ఆడాలని చాలామంది కోరుకున్నారని తెలిపాడు. బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో అతను టెస్టుల్లో ఆరంగేట్రం చేశాడు. కీలకమైన లబూషేన్ (49)ను ఔట్ చేశాడు.
KS Bharat : భారత జట్టుకు ఆడాలనేది ప్రతి క్రికెటర్ కల. తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ కూడా టీమిండియా జెర్సీ కోసం ఎన్నో రోజులు ఎదురుచూశాడు. స్వదేశంలో జరుగుతున్న బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో ఆ అవకాశం రానే వచ్చింది. అయితే.. టీమిండియాకు ఆడాలన్నది తన ఒక్కడి కల కాదని భరత్ అన్నాడు.’ఇది చాలా గర్వించదగ్గ క్షణం. మనసులో ఎన్నో భావోద్వేగాలు ఉన్నాయి. టీమిండియాకు ఆడాలనేది నా ఒక్కడి కల కాదు. నేను జాతీయ జట్టుకు ఆడాలని చాలామంది కోరుకున్నారు. ఈ రోజు కోసం ఎంతో కష్టపడ్డాను. ఇన్నాళ్లుగా జట్టు సభ్యులు, కోచ్‌లతో పాటు కుటుంబం, నా భార్య, స్నేహితులు నాకు చాలా మద్దతుగా నిలిచారు. వాళ్ల సహకారం లేకపోతే ఇది సాధ్యం కాకపోయేది. నాకు వెన్నంటి నిలిచిన వాళ్లందరికీ ఎంతో రుణపడి ఉంటాను’ అని భరత్ తెలిపాడు.
ఆయన నమ్మకంతో..
అంతేకాదు తనపై ఎంతో నమ్మకం ఉంచిన కోచ్‌ను ఈ సందర్భంగా భరత్ గుర్తు చేసుకున్నాడు. ‘నేను ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడే రోజుల్లో ఈ రోజు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే… ఇండియాకు ఆడతాననే నమ్మకం లేదు. అయితే.. కోచ్ జే. కృష్ణా రావు నన్ను నమ్మాడు. నాలో సత్తా ఉందని అతను గట్టిగా విశ్వసించాడు’ అని అతను వెల్లడించాడు.
తొలి వికెట్ కీపర్‌గా
2012లో భరత్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు అతను 79 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. కొన్నాళ్లుగా దేశవాళీ లీగ్స్‌లో నిలకడగా రాణించాడు. రంజీల్లో ట్రిపుల్ సెంచరీ కొట్టిన తొలి వికెట్ కీపర్‌గా భరత్ రికార్డు క్రియేట్ చేశాడు. దాంతో, భారత -ఏ జట్టుకు కూడా ఎంపికయ్యాడు. 2021లో న్యూజిలాండ్ సిరీస్‌కు సాహా ప్లేస్‌లో భారత జట్టు రెండో కీపర్‌గా భరత్ ఎంపికయ్యాడు. అయితే.. తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. ఈ యంగ్‌స్టర్ 2022 ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడాడు.
కీలక స్టంపింగ్..
బోర్డర్- గవాస్కర్ ట్రోఫీకి రిషభ్ పంత్ ప్లేస్‌లో కీపర్‌గా భరత్ జట్టులో స్థానం సంపాదించాడు. ఓపెనర్, వికెట్‌కీపర్ ఇషాన్ కిషన్ నుంచి పోటీ ఎదురైనా కూడా కెప్టెన్ రోహిత్, కోచ్ ద్రవిడ్ అతడి వైపే మొగ్గు చూపారు. కెప్టెన్ నమ్మకాన్ని అతను వమ్ము చేయలేదు. తొలి టెస్టులో ఉస్మాన్ ఖవాజా ఎల్బీగా ఔట్ కావడంలో అతని పాత్రం ఉంది. సిరాజ్ ఎల్బీకి అప్పీల్ చేశాడు. కానీ, అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. కెప్టెన్ రోహిత్ వికెట్ కీపర్ అయిన భరత్‌ను అడిగి, రివ్యూ తీసుకున్నాడు. అంతేకాదు రెండో సెషన్లో భరత్ కీలకమైన లబూషేన్‌ను 49 రన్స్ వద్ద స్టంప్ ఔట్ చేశాడు. జడేజా ఓవర్లో ఫ్రంట్ ఫుట్ ఆడిన లబుషేన్‌ను రెప్పపాటులో స్టంప్ ఔట్ చేసి సంబరాలు చేసుకున్నాడు. జడ్డూ. అశ్విన్ చెలరేగడంతో ఆస్ట్రేలియా 177 పరుగులకే ఆలౌట్ అయంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

