MI vs RCB : పంతొమ్మిదో సీజన్లో మరో ఉత్కంఠ పోరు అభిమానులను అలరించింది. లో స్కోరింగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఆర్సీబీని అదిరే విక్టరీ కొట్టింది. బ్యాటింగ్‌కు అనుకూలించని పిచ్ మీద టాపార్డర్ విఫలమైనా కృనాల్ పాండ్యా(73) ఒంటరి పోరాటంతో బెంగళూరును గట్టెక్కించాడు. కానీ, పట్టువదలని ముంబై బౌలర్లు డెత్ ఓవర్లలో పకడ్బందీగా బౌలింగ్ చేయడంతో చివరి ఓవర్ కీలకమైంది. భువనేశ్వర్(7 నాటౌట్) సిక్సర్ కొట్టగా.. చివరి బంతికి రసిక్ దార్ సలాం(3 నాటౌట్) రెండు పరుగులు తీయడంతో ముంబైకి ఓటమి తప్పలేదు.
ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడిన ఆర్సీబీ కీలక మ్యాచ్‌లో పంజా విసిరింది. రాయ్‌పూర్‌లో ముంబై ఇండియన్స్‌ను ఆఖరి ఓవర్ థ్రిల్లర్‌లో చిత్తు చేసిన బెంగళూరు 14 పాయింట్లతో ముందంజ వేసింది. అయితే.. ఈ విజయం అంత తేలికగా ఏమీ రాలేదు. టాపార్డర్ విఫలమైనా.. కృనాల్ పాండ్యా(73) అద్భుత అర్ధశతకంతో గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ముంబైని 166కే కట్టడి చేసిన ఆర్సీబీ ఇన్నింగ్స్ కూడా తడబడుతూనే సాగింది. విరాట్ కోహ్లీ(0) గోల్డెన్ డకవ్వగా.. ఇంప్యాక్ట్ సబ్ దేవ్‌దత్ పడిక్కల్(12)ను ఔట్ చేసి ఒత్తిడిలో పడేశాడు. బ్యాటింగ్‌కు ఏమాత్రం అనుకూలించని పిచ్ మీద అపసోపాలు పడిన జాకబ్ బెథెల్(27), కెప్టెన్ రజత్ పాటిదార్(8)లు ఆర్సీబీని ఆదుకోవాలనుకున్నారు.
WHAT ON EARTH HAVE WE JUST WITNESSED! 🤯
Bhuvneshwar Kumar & Rasikh Dar, take a bow ❤️
Updates ▶️ https://t.co/wYlCB10dhm#TATAIPL | #KhelBindaas | #RCBvMI | @RCBTweets pic.twitter.com/tqkuPMEsHR
— IndianPremierLeague (@IPL) May 10, 2026
కానీ, పాటిదార్‌ను బాస్చ్ బోల్తా కొట్టించాడు. అనంతరం కృనాల్ పాండ్యా(73) జతగా సమయోచితంగా ఆడిన బెథెల్ స్కోర్ దాటించాడు. క్రీజునంటుకొని నాలుగో వికెట్‌కు 52 రన్స్ జోడించిన ఈ ద్వయాన్ని బాస్చ్ విడదీశాడు. జితేవ్ శర్మ(18) ధాటిగా ఆడే క్రమంలో ఔటవ్వగా డేంజరస్ టిమ్ డేవిడ్(0) గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. అంతే.. అప్పటిదాకా ఆర్సీబీ చేతుల్లో ఉన్న మ్యాచ్ కాస్త ముంబై వైపు మళ్లింది. ఓవైపు కండరాల నొప్పితో బాధ పడుతూనే గజన్ఫర్ వేసిన 18వ ఓవర్లో రెండు సిక్సర్లతో మళ్లీ బెంగళూరును పోటీలోకి తెచ్చాడు. కానీ, బుమ్రా మూడు రన్సే ఇవ్వగా చివరి ఓవర్లో 15 పరుగులు అవసరమయ్యాయి. రొమారియో షెపర్డ్() ఔటైనా.. భువనేశ్వర్(7 నాటౌట్) సిక్సర్‌తో ముంబై డీలా పడింది. చివరి బంతికి రసిక్ దార్ సలాం(3 నాటౌట్) రెండు పరుగులు తీయడంతో ఆర్సీబీ జయకేతనం ఎగురవేసింది.
Bossing the game with back-to-back wickets 🔥
Corbin Bosch finishes with his best-ever #TATAIPL figures of 4/26 👏
Updates ▶️ https://t.co/wYlCB10dhm#KhelBindaas | #RCBvMI | @mipaltan pic.twitter.com/ujrIwiZqWT
— IndianPremierLeague (@IPL) May 10, 2026
రాయ్‌పూర్‌లో ముంబై ఇండియన్స్ టాపార్డర్ కుప్పకూలినా తిలక్ వర్మ(57), నమ్ధిర్(47)లు ఆదుకున్నారు. ఈ సీజన్లో రెచ్చిపోతున్న ఆర్సీబీ పేసర్ భునేశ్వర్(4-23) ఎప్పటిలానే బ్రేకిచ్చాడు. ఓపెనర్ రికెల్టన్(2)ను ఔట్ చేసిన భువి.. అదే ఊపులో వరస బంతుల్లో రోహిత్ శర్మ(22), సూర్యకుమార్ యాదవ్(0)ను ఔట్ చేసి ముంబైని ఒత్తిడిలో పడేశాడు.
తిలక్ వర్మ(57), నమన్ ధిర్(47)లు నిలబడ్డారు. కాస్త కుదురుకున్నాక బౌండరీలతో చెలరేగిన ఇద్దరు స్కోర్ బోర్డును ఉరికించారు. తిలక్ అర్ధ శతకంతో 12 ఓవర్లకే స్కోర్ వంద దాటింది. అయితే.. ఈ జోడీని విడదీసి ముంబైకి బ్రేకులు వేశాడు షెపర్డ్. విల్ జాక్స్(10), రాజ్ బవా(16)లు ధాటిగా ఆడలేకపోవడంతో ముంబై 166కే పరిమితమైంది.