Shane Watson | ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ కొత్త అవతారం.. కేకేఆర్ అసిస్టెంట్ కోచ్‌గా నియామకం..!
Shane Watson | ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్ వాట్సన్‌ను కేకేఆర్ జట్టులోకి తీసుకుంది. మాజీ ఆల్‌రౌండర్ కేకేఆర్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరిస్తాడని గురువారం వెల్లడించింది.
Shane Watson | ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్ వాట్సన్‌ను కేకేఆర్ జట్టులోకి తీసుకుంది. మాజీ ఆల్‌రౌండర్ కేకేఆర్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరిస్తాడని గురువారం వెల్లడించింది. ఆస్ట్రేలియా తరఫున 59 టెస్టులు, 190 వన్డేలు, 58 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచులు ఆడిన వాట్సన్.. ఇంటర్నేషనల్ కెరీర్లో 10వేలకుపైగా పరుగులు చేశాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 280 కంటే ఎక్కువ వికెట్ల పడగొట్టాడు. వాట్సన్ 2007, 2015లో ప్రపంచకప్ గెలిచి ఆస్ట్రేలియా జట్టులో కీలకపాత్ర పోషించాడు. 2008 నుంచి 2020 వరకు ఐపీఎల్లో పలు జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్లో 145 మ్యాచ్‌లు ఆడాడు. రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగాడు. క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక వాట్సన్ ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌లో కోచ్, మెటర్ పాత్రలు పోషించాడు.
కేకేఆర్ అసిస్టెంట్ కోచ్‌గా అవతారమెత్తిన వాట్సన్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేకేఆర్ కోచింగ్ గ్రూప్, ప్లేయర్స్‌తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. కోల్‌కతాకు మరో టైటిల్‌ను తీసుకువచ్చేందుకు తాను ఎదురుచూస్తున్నానని చెప్పాడు. కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ మాట్లాడుతూ వాట్సన్‌ను కేకేఆర్ ఫ్యామిలీలోకి స్వాగతించడానికి సంతోషిస్తున్నామన్నారు. ఆటగాడిగా, కోచ్‌గా అతనికున్న అనుభవం జట్టుకు ఎంతో దోహదపడుతుందని చెప్పాడు. అభిషేక్ నాయర్‌ను కేకేఆర్ ఇటీవల హెడ్‌కోచ్‌గా నియమించింది. ముంబయి మాజీ ఆల్ రౌండర్ అయిన నాయర్‌కు కేకేఆర్‌తో చాలా రోజులుగా అనుబంధం ఉన్నది. అయితే, ఐపీఎల్ 2025లో జట్టు ప్రదర్శన పేలవంగా ఉండగా.. కేకేఆర్ జట్టును బలోపేతం చేయాలని భావిస్తుంది. కేకేఆర్ గత సీజన్లో ఆడిన 14 లీగ్ మ్యాచుల్లో కేవలం ఐదింట్లో గెలిచింది. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

