Virat Kohli | ప్రపంచ క్రికెట్లో విరాట్ ఒక అద్భుతం.. అందుకు సాక్ష్యాలివిగో
Virat Kohli : ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్(Dan Bradman), భారత లెజెండ్ సచిన్ టెండూల్కర్(Sachin Tenulkar) తర్వాత ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడు ఎవరు?.. మాస్టర్ బ్లాస్టర్ నెలకొల్పిన కష్టసాధ్యమైన రికార్డులను బ్రేక్ చేసేంత దమ్మున్న ఆటగాడు ఎవరు?.. ఈ ప్రశ్నలకు టీమిండియా స్టార్...
Virat Kohli : ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్(Dan Bradman), భారత లెజెండ్ సచిన్ టెండూల్కర్(Sachin Tenulkar) తర్వాత ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడు ఎవరు?.. మాస్టర్ బ్లాస్టర్ నెలకొల్పిన కష్టసాధ్యమైన రికార్డులను బ్రేక్ చేసేంత దమ్మున్న ఆటగాడు ఎవరు?.. ఈ ప్రశ్నలకు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli) చాలాసార్లు సమాధానం చెప్పాడు. అండర్ 19 వరల్డ్ కప్ హీరోగా జట్టులోకి వచ్చిన కోహ్లీ.. 24 గజాల పిచ్ మీద అద్భుతాలను ఆవిష్కరిస్తున్నాడు.
కోహ్లీ క్రీజులోకి అతడు వచ్చాడంటే ఒత్తిడంతా దూదిపింజాలా తేలిపోతుంది. మైదానంలో చిరుతను తలపించే విరాట్ కడదాకా నిలబడితే కొండంత లక్ష్యమైనా చకచకా కరిగిపోతుంది. భారత జట్టుకు ఆపద్భాందవుడు, ఫిట్నెస్ ఐకాన్ అయిన విరాట్ ఆదివారం 35వ పడిలోకి అడుగుపెట్టాడు. కోట్లాదిమంది అభిమానగణం ముక్తకంఠంతో అతడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. టెక్నిక్, షాట్ల ఎంపికలో ఈకాలం క్రికెటర్లకు ఆరాధ్యుడైన కోహ్లీ ఆల్ టైమ్ రికార్డులివే.
1. మూడు ఫార్మాట్లలో అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్ల జాబితాలో విరాట్ రెండో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం అతడి ఖాతాలో 78 సెంచరీలు ఉన్నాయి. ఈ లిస్ట్‌లో సచిన్ 100 శతకాలతో టాప్‌లో నిలిచాడు.
2. ఛేజ్ మాస్టర్‌గా పేరొందిన కోహ్లీ 159 మ్యాచుల్లో 65.49 సగటుతో 7,794 రన్స్ చేశాడు. అందులో 27 సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

3. ప్రపంచ క్రికెట్లో ఒకే క్యాలండర్ ఇయర్లో 8 సార్లు వెయ్యి పరుగులు చేసిన క్రికెటర్‌గా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. సచిన్ (7), గంగూలీ(6), కమార సంగక్కర(5) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
4. ప్రపంచ క్రికెట్లో రెండు జట్లపై హ్యాట్రిక్ సెంచరీలు కొట్టిన తొలి ఆటగాడు కోహ్లీ. శ్రీలంక, వెస్టిండీస్‌పై అతడు ఈ ఫీట్ నమోదు చేశాడు. అంతేకాదు శ్రీలంకపై రికార్డు స్థాయిలో 10 శతకాలు బాదాడు.
5. టెస్టుల్లో వేగంగా 4 వేల పరుగులు పూర్తి చేసిన కెప్టెన్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. అప్పటివరకూ విండీస్ మాజీ క్రికెటర్ బ్రియాన్ లారా రికార్డు బద్ధలు కొట్టాడు. లారా 71 ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్ సాధిస్తే.. విరాట్ కేవలం 65 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయికి చేరుకున్నాడు.

6. టెస్టు కెప్టెన్‌గా విరాట్ ఆరు డబుల్ సెంచరీలు బాదాడు. 2017 డిసెంబర్న అతడు ఈ ఘనత సాధించాడు. దాంతో, 5 ద్విశతకాలతో బ్రియాన్ లారా పేరిట ఉన్న రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.
7. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన భారత క్రికెటర్ కోహ్లీనే. అతడిని మంది 259 మిలియన్ .. అంటే 25 కోట్ల మంది ఫాలో అవుతున్నారు.

నిరుడు ఆసియా కప్‌లో ఫామ్ అందుకున్న విరాట్.. సొంత గడ్డపై జరుగుతున్న వన్డే వరల్డ్ కప్‌లో చెలరేగి ఆడుతున్నాడు. ఈ మెగా టోర్నీలో ఈ రన్ మెషిన్ వన్డేల్లో 48 శతకం ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకూ ఆడిన 7 మ్యాచుల్లో కోహ్లీ 442 పరుగులు సాధించాడు. ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాపై కోహ్లీ సెంచరీ కొట్టాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు.
ఇవి కూడా చదవండి
-
Personal Finance Tips | ఉద్యోగమా.. వ్యాపారామా? ఈ రెండింటిలో ఏది బెటర్? మధ్యే మార్గం ఏదీ లేదా?
-
Dum Masala Song | ‘ధమ్ మసాలా బిర్యానీ’.. ఎర్ర కారం, అర కోడి.. ‘గుంటూరు కారం’ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

