కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు సమయం దగ్గరపడుతోంది. ఆ మెగా టీ20 టోర్నీ కోసం అన్ని జట్లు ప్రిపేరవుతున్నాయి. అయితే కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)కు భారీ జలక్ తగిలింది. పేస్ బౌలర్ హర్షిత్ రాణా.. ఈసారి ఐపీఎల్లో ఆడేది డౌట్‌గా ఉన్నది. హర్షిత్ కుడి కాలు మోకాలికి ఇటీవల సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. దీంతో అతని స్థానంలో మరో కొత్త బౌలర్‌ను సెలెక్ట్ చేసేందుకు కేకేఆర్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి 29వ తేదీన ముంబై ఇండియన్స్‌తో కేకేఆర్ తొలి మ్యాచ్ ఆడాల్సి ఉన్నది. హర్షిత్ రాణా స్థానంలో కొత్త బౌలర్‌ను తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నామని ఇవాళ కోచ్ అభిషేక్ నాయర్ తెలిపారు.
ఇటీవల టీ20 వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో హర్షిత్ రాణా మోకాలికి గాయమైంది. దీంతో అతను సర్జరీ చేయించుకున్నాడు. ప్రస్తుతం బెంగుళూరులోని బీసీసీఐకి చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రిహాబిలిటేషన్ పొందుతున్నాడు. అయితే కేకేఆర్ జట్టుతో అతను ఎప్పుడు కలుస్తాడో ఇప్పుడే చెప్పలేమని కోచ్ పేర్కొన్నారు. గడిచిన కొన్ని సీజన్లలో అతను కీలక ఆటగాడిగా ఎదిగాడని, హర్షిత్ రాణా లేకపోవడం పెద్ద లోటే అని, అతన్ని రీప్లేస్ చేయడం కూడా కష్టమైన పని అని నాయర్ మీడియాతో పేర్కొన్నారు. కొన్ని రోజుల నుంచి కొత్త బౌలర్లను పరిశీలిస్తున్నామని, హర్షిత్ రీప్లేస్మెంట్పై త్వరలో నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు.