Ind Vs Nz: కివీస్ స్పిన్నర్ల దూకుడు.. తీవ్ర వత్తిడిలో ఇండియా
Ind Vs Nz: కివీస్ స్పిన్నర్ సాంట్నర్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. పుణె టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇండియా టాప్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై.. భారత బ్యాటర్లు తడబడుతున్నారు.
పుణె: న్యూజిలాండ్(Ind Vs Nz) స్పిన్నర్లు రాణించారు. ఇవాళ ఉదయం ఇద్దరు స్పిన్నర్లే టీమిండియాను ముప్పుతిప్పలు పెట్టారు. భారత టాప్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది. రెండో టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇండియా భోజన విరామ సమయానికి 38 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 107 రన్స్ చేసింది. సాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్.. అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై భారత బ్యాటర్లు తడబడుతున్నారు. స్కోరింగ్ ఇబ్బందిగా మారింది. విరాట్ కోహ్లీ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి నిష్క్రమించాడు.
గిల్ 30 రన్స్ చేసి ఔటవ్వగా, పంత్ 18 రన్స్‌కు వెనుదిరిగాడు. ఫస్ట్ టెస్టులో సెంచరీ చేసిన సర్ఫరాజ్ 11 రన్స్‌కే పెవిలియన్‌కు చేరుకున్నాడు. సాంట్నర్ బౌలింగ్‌లో భారీ షాట్ కొట్టబోయి ఔటయ్యాడు. 16 పరుగుల వద్ద రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా.. అసలు ఏమాత్రం నిలదొక్కుకోలేకపోతున్నది. కివీస్ స్పిన్ ఉచ్చులో ఇండియన్ బ్యాటర్లు చిక్కుకుపోయారు. సాంట్నర్ 4, ఫిలిప్స్ రెండు వికెట్లు తీసుకున్నారు. క్రాస్ బ్యాట్ షాట్ ఆడబోయిన పంత్, కోహ్లీ క్లీన్ బౌల్డ్ అయ్యారు.
ఫస్ట్ ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 259 రన్స్ చేసింది. ప్రస్తుతం ఇండియా 152 రన్స్ వెనుకబడి ఉన్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

