Usman Khawaja | ఆస్ట్రేలియా గొప్ప ఓపెనర్లలో అతనొకడు.. స్టార్ ఆటగాడికి ఖవాజా మద్దతు
Usman Khawaja : యాషెస్ సిరీస్(Ashes Series)లో కీలకమైన నాలుగో టెస్టు ఎల్లుండి(జూలై 19న) మొదలవ్వనుంది. అయితే.. ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్(David Warner)పైనే అందరి దృష్టి మాత్రం ఉంది. ఈ నేపథ్యంలో మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(Usman Khawaja) మాత్రం వార్నర్‌కు మద్దతు తెలిపాడు. ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో వార్నర్...
Usman Khawaja : యాషెస్ సిరీస్(Ashes Series)లో కీలకమైన నాలుగో టెస్టు ఎల్లుండి(జూలై 19న) మొదలవ్వనుంది. అయితే.. ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్(David Warner)పైనే అందరి దృష్టి మాత్రం ఉంది. ఎందుకంటే..? వరుసగా మూడు టెస్టుల్లో భారీ స్కోర్లు చేయలేకపోయిన ఈ లెఫ్ట్ హ్యాండర్పై వేటు పడనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (Usman Khawaja) మాత్రం వార్నర్‌కు మద్దతు తెలిపాడు. ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో వార్నర్ గొప్ప ఓపెనర్ అని ఖవాజా అన్నాడు.
‘నా దృష్టిలో ఆసీస్ గొప్ప ఓపెనర్లలో డేవిడ్ వార్నర్ ఒకడు. మీడియాలో అతడి గురించి వస్తున్న వార్తలను నేను నమ్మను. ఇప్పుడు అతడిపైనే ఫోకస్ ఉందని తెలుసు. అయినా సరే.. నేను వార్నర్‌కు బాసటగా నిలుస్తాను. అంతేకాదు నంబర్ 1 బ్యాటర్ మార్నస్ లబూషేన్(Marnus Labuschagne), వార్నర్ ఆఖరి రెండు టెస్టుల్లో భారీ స్కోర్లు చేస్తారని నమ్ముతున్నా’ అని ఖవాజా వెల్లడించాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-1తో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.
డేవిడ్ వార్నర్

యాషెస్ సిరీస్‌లో చెత్త ప్రదర్శనతో వార్నర్ తీవ్ర విమర్శల పాలవుతున్నాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ పేసర్ స్టువార్ట్ బ్రాడ్(Stuart Broad) బౌలింగ్‌లో తరచూ వికెట్ పారేసుకుంటూ నిరాశపరుస్తున్నాడు. హెడింగ్లే (Headingley) టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో అతను బ్రాడ్ ఓవర్లోనే వెనుదిరిగాడు. దాంతో, ఈ సిరీస్‌లో విధ్వంసక ఓపెనర్ సగటు 23.5కు పడిపోయింది. వరుసగా విఫలమవుతున్న వార్నర్‌ను కీలకమైన నాలుగో టెస్టుకు పక్కన పెట్టాలని ఆసీస్ మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు.
ఉస్మాన్ ఖవాజా

మరోవైపు టెస్టు ర్యాంకింగ్స్(ICC Rankings)లో నంబర్ 1 మార్నస్ లబూషేన్ కూడా ఈ సిరీస్‌లో దారుణంగా ఆడుతున్నాడు. మూడు టెస్టుల్లో అతను ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. ఖవాజా మాత్రం ఈసారి అద్భుతంగా రాణిస్తున్నాడు. అతడి ఖాతాలో ఒక సెంచరీ, రెండు హాఫ సెంచరీలు ఉన్నాయి. సిరీస్ డిసైడర్ అయిన నాలుగో టెస్టులోనూ భారీ స్కోర్ చేయాలని ఖవాజా భావిస్తున్నాడు. మాంచస్టర్లోని ఓల్డ్ ట్రఫోర్డ్‌లో జూలై 19 నుంచి 23 వరకు నాలుగో టెస్టు జరుగనుంది.
ఇవి కూడా చదవండి
India vs Westindies | వందో టెస్టుకు సిద్ధమవుతున్న భారత్, వెస్టిండీస్.. రికార్డులు ఏం చెప్తున్నాయంటే..?
Carlos Alcaraz: డేటింగ్లో వింబుల్డన్ చాంపియన్.. అల్కరాజ్ గర్ల్‌ఫ్రెండ్ ఎవరో తెలుసా?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

