Carlos Alcaraz: డేటింగ్లో వింబుల్డన్ చాంపియన్.. అల్కరాజ్ గర్ల్‌ఫ్రెండ్ ఎవరో తెలుసా?
Carlos Alcaraz : 20 ఏళ్ల అల్కరాజ్.. డేటింగ్లో ఉన్నాడు. ఆ వింబుల్డన్ చాంపియన్ తన ఊరి అమ్మాయితోనే షికార్లు కొడుతున్నాడు. ఆ ఇద్దరు పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు కూడా కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మారియాకు కిస్ ఇచ్చిన ఫోటోను ఇటీవల అల్కరాజ్ తన ఇన్‌స్టాలో పోస్టు చేశాడు.
లండన్: ఈ యేటి వింబుల్డన్ గెలిచిన స్పెయిన్ టెన్నిస్ ప్లేయర్ కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz) .. ఇప్పటికే డేటింగ్లో ఉన్నాడు. ఫైనల్లో జోకోవిచ్‌కు షాకిచ్చిన ఆ కుర్రాడు.. డేటింగ్లోనూ దూకుడు ప్రదర్శిస్తున్నాడు. స్పెయిన్‌లోని ముర్సికా అనే పట్టణానికి చెందిన కార్లోస్.. ఆ టౌన్‌కే చెందిన మారియా గొంజాలెజ్ గిమినేజ్(Maria González Giménez) అనే అమ్మాయితో డేటింగ్లో ఉన్నాడు. ఆ ఇద్దరి మధ్య రిలేషన్ ప్రస్తుతం సీక్రెట్‌గా కొనసాగుతున్నా.. ఇటీవల కార్లోస్ ఇన్‌స్టాలో చేసిన ఓ పోస్టు కొన్ని డౌట్స్ క్రియేట్ చేసింది. మారియాను కిస్ ఇస్తున్న ఫోటోను అల్కరాజ్ తన ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. దీంతో ఆ ఇద్దరి మధ్య రిలేషన్ ఉన్నట్లు టెన్నిస్ అభిమానులు డిసైడ్ అయిపోయారు.
20 ఏళ్ల అల్కరాజ్ కొన్నాళ్ల నుంచి డేటింగ్లో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఆ ఇద్దరి పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మారియా కూడా ముర్సియా క్లబ్ తరపునే టెన్నిస్ ఆడుతుంది.
అల్కరాజ్ తన కెరీర్లో ఇప్పటికే 12 ఏటీపీ సింగిల్స్ టైటిల్స్ గెలిచాడు. గత ఏడాది యూఎస్ ఓపెన్ సొంతం చేసుకున్నాడు. నాలుగు మాస్టర్స్ టైటిళ్లను కూడా అతను కైవసం చేసుకున్నాడు. జోకోవిచ్ ప్రాక్టీసు మ్యాచ్‌లను వీడియో తీసిన వివాదంలో అల్కరాజ్ ఇరుక్కున్నా.. వింబుల్డన్ ఫైనల్లో అతనే ఓడించడం గమనార్హం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

