Collins Obuya | నైరోబి :కెన్యా దిగ్గజ ఆల్‌రౌండర్ కొలిన్స్ ఒబుయా అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. 42 ఏండ్ల కొలిన్స్.. ఐసీసీ నిర్వహిస్తున్న ఆఫ్రికన్ గేమ్స్‌లో భాగంగా ఉగాండాతో చివరి మ్యాచ్ ఆడాడు. 2001లో అరంగేట్రం చేసిన ఒబుయా.. తన కెరీర్లో 3 వన్డే వరల్డ్ కప్‌లు, ఒక టీ20 ప్రపంచకప్ ఆడాడు.
2003 వన్డే వరల్డ్ కప్‌లో కెన్యా సెమీస్ చేరడంలో ఒబుయా కీలకపాత్ర పోషించాడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై ఒబుయా చేసిన 98 రన్స్ అతడి కెరీర్లో బెస్ట్ ఇన్నింగ్స్. వన్డేలలో 2,044 పరుగులు చేసిన అతడు టీ20లలో 1,668 రన్స్ చేశాడు. అంతర్జాతీయ స్థాయిలో ఒబుయా ఖాతాలో 60 వికెట్లు ఉన్నాయి.