IPL 2023 : గత ఐపీఎల్ సీజన్లో భారీ ధరకు అమ్ముడుపోయిన న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్కు ఈసారి తక్కువ ధర పలికాడు 2023 వేలంలో అతడిని కనీస ధర రూ. 2 కోట్లకు డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్ సొంతం చేసుకుంది. గత 2022 వేలంలో విలియమ్సన్‌ను రూ.14 కోట్లు పెట్టి కొన్నది. అంతేకాదు అతడికి జట్టు పగ్గాలు అప్పగించింది. అయితే, విలియమ్సన్ ఆశించినంతంగా రాణించలేదు. 76 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన విలియమ్సన్ 126.03 స్ట్రైక్‌రేటుతో 2,101 రన్స్ చేశాడు.
కివీస్ విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా పేరుగాంచిన విలియమ్సన్ ఈమధ్యే టెస్టు కెప్టెన్సీ వదులుకున్న విషయం తెలిసిందే. గత ఏడాది అతని కెప్టెన్సీలో న్యూజిలాండ్ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ట్రోఫీ నెగ్గింది. ఫైనల్లో భారత్‌ను ఓడించి మొదటి టైటిల్‌ను సొంతం చేసుకుంది. అంతేకాదు న్యూజిలాండ్‌ను 2019 వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేర్చాడు. అయితే సూపర్ ఓవర్లో అనూహ్యంగా ఇంగ్లండ్ విజేతగా నిలిచింది.