Jyothi Yerraji : హాంగ్జౌ వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో(Aisan Games 2023) వెండి వెలుగులు విరజిమ్మిన తెలుగు తేజం జ్యోతి ఎర్రాజీ(Jyothi Yerraji) నేషనల్ గేమ్స్‌లోనూ సత్తా చాటింది. గోవా వేదికగా జరిగిన మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో జ్యోతి గోల్డ్ మెడల్ సాధించడమే కాకుండా రికార్డు బ్రేక్ చేసింది. చిరుతలా పరుగెత్తిన జ్యోతి 13.22 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. తద్వారా నిరుడు తాను నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టింది. నిత్యా రామరాజ్ 13.36 సెకన్లతో రజత పతకం దక్కించుకోగా.. సప్నా కుమారి (13.33 సెకన్లు) కాంస్యంతో సరిపెట్టుకుంది.
చైనాలోని హాంగ్జౌలో నెల క్రితం జరిగిన ఆసియా క్రీడల్లో జ్యోతి సిల్వర్ మెడల్‌తో సంచనం సృష్టించింది. 12.78 సెకన్లలోనే 100 మీటర్ల హర్డిల్స్‌ను పూర్తి చేసి ఔరా అనిపించింది. అయితే.. చైనా అథ్లెట్ వూ యన్నీ ఫౌల్కు పాల్పడడంతో రేసులో మూడో స్థానంలో నిలిచిన జ్యోతి అనూహ్యంగా రజతం అందుకుంది. ఆ మెడల్‌ను మరణించిన తన మెంటర్, స్నేహితుడు గౌతమ్‌కు అంకితమిచ్చింది.