Lionel Messi | అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీకి బాలన్ డీ ఓర్ అవార్డ్.. బెస్ట్ ఫుట్‌బాలర్‌గా ఎనిమిదోసారి
ప్రముఖ ఫుట్‌బాల్ ఆటగాడు, అర్జెంటీనా (Argentina) స్టార్ ప్లేయర్ లియోనిల్ మెస్సీ (Lionel Messi) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచంలోనే ఉత్తమ ఫుట్‌బాల్ క్రీడాకారులకు ఇచ్చే బాలన్ డీ ఓర్ (Ballon d’Or trophy) అవార్డును మరోసారి దక్కించుకున్నాడు.
పారిస్: ప్రముఖ ఫుట్‌బాల్ ఆటగాడు, అర్జెంటీనా (Argentina) స్టార్ ప్లేయర్ లియోనిల్ మెస్సీ (Lionel Messi) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచంలోనే ఉత్తమ ఫుట్‌బాల్ క్రీడాకారులకు ఇచ్చే బాలన్ డీ ఓర్ (Ballon d’Or trophy) అవార్డును మరోసారి దక్కించుకున్నాడు. 2022-23కుగాను ఉత్తమ ప్రదర్శన కనబర్చడంతోపాటు గతేడాది ఖతర్ (Qatar) వేదికగా జరిగిన ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో (FIFA World Cup) అర్జెంటీనాను గెలిపించినందుకు గాను ఈ అవార్డును అందుకున్నాడు. దీంతో ఈ అవార్డును అత్యధికంగా ఎనిమిదిసార్లు అందుకున్న ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. ఫ్రాన్స్‌లోని పారిస్‌లో (Paris) జరిగిన వేడుకల్లో మెస్సీకి అవార్డును అందజేశారు.
మాంచెస్టర్ సిటీ స్రైకర్ ఎర్లింగ్ హాలాండ్, పారిస్ సెయింట్-జెర్మైన్ ఫార్వర్డ్ కైలియన్ ఎంబాప్పేలను వెనక్కినెట్టి మెస్సీ అవార్డు గెలుచుకున్నాడు. 2022-23 సీజన్లో మొత్తం 55 మ్యాచ్‌లు ఆడిన 36 ఏండ్ల మెస్సీ 32 గోల్స్ చేయడంతోపాటు 25 అసిస్ట్‌లను అందించాడు. ఈ అర్జెంజీనా స్టార్ ప్లేయర్ గతంలో 2009, 2010, 2011, 2012, 2015, 2019, 2022లో ఈ అవార్డు దక్కించుకున్నాడు. మెస్సీ తర్వాత ఈ అవార్డును ఎక్కువగా అందుకున్నవారిలో క్రిస్టియానో రొనాల్డో (5) రెండో స్థానంలో ఉన్నాడు.
Argentina’s Lionel Messi wins the Ballon d’Or award for the best footballer in the world for a record 8th time
(File photo) pic.twitter.com/DFLc0oJ7eO
— ANI (@ANI) October 30, 2023
ఇక మహిళల విభాగంలో స్పెయిన్, మార్సిలోనా జట్టు మిడ్‌ఫీల్డర్ ఐతన బొన్మాటి తొలిసారిగా బాలన్ డి ఓర్ అవార్డును అందుకున్నది. 2023 మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్ స్పెయిన్ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
M8️⃣SSI#ballondor pic.twitter.com/ebEE6bOk1C
— Ballon d’Or #ballondor (@ballondor) October 30, 2023
Here are all the women’s Ballon d’Or winners!#ballondor pic.twitter.com/OHdqQGYIgH
— Ballon d’Or #ballondor (@ballondor) October 30, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

