IPL | లక్నో: ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ).. జస్టిన్ లాంగర్‌ను హెడ్‌కోచ్‌గా నియమించుకుంది. ప్రస్తుతం కోచ్‌గా వ్యవహరిస్తున్న ఆండీ ఫ్లవర్ కాంట్రాక్ట్ ముగియడంతో అతడి స్థానంలో ఆస్ట్రేలియా మాజీ కోచ్‌ను ఎంపిక చేసుకున్నట్లు ఫ్రాంఛైజీ శుక్రవారం ప్రకటించింది.
ఆసీస్ ఓపెనర్‌గా, కోచ్‌గా విజయవంతమైన లాంగర్ తమ జట్టును మరింత ముందుకు తీసుకెళ్తాడనే నమ్మకముందని ఆ జట్టు యజమాని సంజీవ్ పేర్కొన్నాడు. భారత మాజీ ఓపెనర్, లక్నో మెంటార్ గౌతమ్ గంభీర్ సూచన మేరకే లాంగర్‌ను ఎంపిక చేసినట్లు వెల్లడించాడు.