Unofficial Test | శతక్కొట్టిన జురెల్.. పోరాడుతున్న శ్రీలంక ఏ..!
Unofficial Test : అనధికారిక టెస్టులో భారీ స్కోర్ కొట్టిన భారత ఏ జట్టు 452/6 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడమే ఆలస్యం బౌలర్లు ప్రత్యర్థిని ఆదిలోనే దెబ్బతీశారు.
Unofficial Test : అనధికారిక టెస్టులో భారత ఏ జట్టు కెప్టెన్ ధ్రువ్ జురెల్(141 నాటౌట్) శతకంతో రెచ్చిపోయాడు. సుదీర్ఘ ఫార్మాట్‌పై తనకున్న ఇష్టాన్ని పరుగుల రూపంలో చూపించగా.. శ్రీలంక ఏ బౌలర్లు కుదేలయ్యారు. భారీ స్కోర్ కొట్టిన టీమిండియా 452/6 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడమే ఆలస్యం బౌలర్లు ప్రత్యర్థిని ఆదిలోనే దెబ్బతీశారు. నువనిందు ఫెర్నాండో(65 నాటౌట్) అర్ధ శతకంతో మెరవగా.. రెండు వికెట్ల నష్టానికి 113 రన్స్ కొట్టింది లంక ఏ.
గాలే స్టేడియంలో జరుగుతున్న మొదటి అనధికారిక టెస్టులో భారత ఏ జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. కెప్టెన్ ధ్రువ్ జురెల్(141 నాటౌట్) శతకంతో రెండో రోజు టీ అనంతరం తొలిరోజు 452/6 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన టీమిండియా.. ప్రత్యర్థిని దెబ్బకొట్టింది.
Stumps on Day 2, Sri Lanka ‘A’ trail by 339 runs. #SLvIND pic.twitter.com/5q0oIqWaPS
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) June 26, 2026
ఓపెనర్ నిరోషన్ డిక్వెల్(10)ను ఔట్ చేసిన అన్షుల్ కంభోజ్ లంకకు షాకిచ్చాడు. మరో ఎండ్‌లో అకీబ్ నబీ కట్టడి చేయగా.. యశ్ ఠాకూర్ ఓవర్లో పవంత వీరసింఘే వెనుదిరిగాడు. 38కే రెండు వికెట్లు పడిన వేళ.. నువనిందు ఫెర్నాండో(65 నాటౌట్), అషెన్ బండార(18 నాటౌట్) క్రీజునంటుకుపోయారు.
తొలి వికెట్‌కు 92 రన్స్
ఓపెనర్ సాయి సుదర్శన్(132), ఆయుష్ పాండే(25)లు భారత ఏ జట్టుకు శుభారంభమిచ్చారు. తొలి వికెట్‌కు 92 రన్స్ జోడించిన సాయి.. ఆ తర్వాత దేవ్‌దత్ పడిక్కల్(12), రుతురాజ్ గైక్వాడ్(22)లతో విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు.
Stumps on Day 2️⃣ in Galle!
India A lead by 3️⃣3️⃣9️⃣ runs on the back of a strong 1st innings total of 452/6 d, with Sri Lanka A 113/2 at stumps 👏
Captain Dhruv Jurel led the charge with a fantastic 141(215) 💯
#SLAvINDA pic.twitter.com/nBNAGOPItM
— BCCI (@BCCI) June 26, 2026
అనంతరం షేక్ రషీద్(63), ధ్రువ్ జురెల్(141 నాటౌట్) మెరవగా.. తొలి రోజే 4 వికెట్ల నష్టానికి 333 రన్స్ కొట్టిన భారత్.. రెండో రోజూ జోరు చూపింది. హర్ష్ దూబే(30)తో కలిసి లంక బౌలర్లను విసిగించిన జురెల్ స్కోర్ నాలుగొందలు దాటించాడు. దూబేను గుణశేఖర( 3-84) ఔట్ చేశాక ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

