Jonty Rhodes | ప్రపంచంలో ఉత్తమ ఫీల్డర్ అతనే : జాంటీ రోడ్స్
Jonty Rhodes : దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ మైదానంలో మెరుపు విన్యాసాలతో అందర్నీమెస్మరైజ్ చేసిన విషయం తెలిసిందే. అలాంటిది అతను ప్రపంచంలో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) బెస్ట్ ఫీల్డర్ అని చెప్పాడు. 16వ సీజన్ ఐపీఎల్లో రోడ్స్ లక్నో సూపర్ జెయింట్స్ ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు.
Jonty Rhodes : క్రికెట్లో బెస్ట్ ఫీల్డర్ ఎవరు? అనగానే అందరికి మొదటగా గుర్తుకొచ్చే పేరు.. జాంటీ రోడ్స్(Jonty Rhodes). ఈ దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఒకప్పుడు అబ్బురపరిచే ఫీల్డింగ్ విన్యాసాలతో ఆశ్చర్యపరిచాడు. మైదానంలో మెరపు వేగంతో కదిలే రోడ్స్ కళ్లు చెదిరే డైవింగ్ క్యాచ్‌లతో అందర్నీమెస్మరైజ్ చేశాడు. ఇంతకు అతను మెచ్చిన ఫీల్డర్ ఎవరో తెలుసా..? టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja). తాజాగా ఒక ఇంటర్వ్యూలో ‘ప్రపంచంలో టాప్ -3 ఫీల్డర్ల పేర్లు చెప్పండి?’ అనగానే రోడ్స్ ఆలోచించకుండా జడ్డూ పేరు మాత్రమే చెప్పాడు. ‘ప్రస్తుతానికి ప్రపంచంలో ఉత్తమ ఫీల్డర్ జడేజా. ఫీల్డింగ్ ప్రమాణాలు మెరుగుపడేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఒక కారణం’ అని రోడ్స్ తెలిపాడు.
‘ఐపీఎల్(IPL) ప్రారంభం కాగానే అన్ని ఫ్రాంఛైజీలు ఫీల్డింగ్ మీద దృష్టి పెడతాయి. అయితే.. అన్నిజట్లకు ఫీల్డింగ్ కోచ్‌లు లేరు. 2008లో మొదటి సీజన్ నుంచి ఇప్పటివరకు 12 నుంచి 13 మంది బెస్ట్ ఫీల్డర్లను చూశాను. నా అభిప్రాయం ప్రకారం మరింత మంది ఫీల్డింగ్ కోచ్‌లు అవసరం. నేను ఏదైనా క్రికెట్ అకాడమీకి వెళ్తే.. అక్కడ కనీసం 3 – 4 మంది ప్లేయర్స్‌ను మోటివేట్ చేస్తాను. అయితే.. రెండు వారాల తర్వాత వాళ్లు చెప్పినవన్నీ మర్చిపోతారు. క్రికెట్‌ను ఎలా సాధన చేస్తున్నామనేది చాలా ముఖ్యం’ అని రోడ్స్ వెల్లడించాడు. ప్రస్తుతం ఈ లెజెండరీ క్రికెటర్ లక్నో సూపర్ జెయింట్స్(LSG) ఫీల్డింగ్ కోచ్‌గా ఉన్నాడు. వరల్డ్‌లో బెస్ట్ ఆల్‌రౌండర్‌గా ఉన్న జడ్డూ చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడుతున్నాడు.
ఇవి కూడా చదవండి
IPL 2023 | కోహ్లీ ఐపీఎల్ ట్రోఫీ కల ఈసారి నిజమవుతుంది.. ప్లే ఆఫ్స్‌కు వెళ్లేది ఈ జట్లే : మంజ్రేకర్
IPL 2023 | చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌లో బర్త్ డే సందడి.. వీడియో చూశారా..?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

