ipl 2021: ఆ ఘనత సాధించిన నాలుగో బ్యాట్స్‌మన్ బెయిర్‌స్టో

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చరిత్రలో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మన్ జానీ బెయిర్‌స్టో అరుదైన ఘనత సాధించాడు. లీగ్‌లో అత్యంత వేగంగా 1000 పరుగుల మైలురాయిని పూర్తి చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్లో బెయిర్‌స్టో అత్యధిక స్కోర్ 114. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 18 బంతుల్లోనే 38 రన్స్ సాధించడం ద్వారా ఈ ఫీట్ అందుకున్నాడు.
ఐపీఎల్లో 26 ఇన్నింగ్స్‌ల్లోనే వెయ్యి పరుగుల మార్క్ అందుకోవడం విశేషం. ఈ జాబితాలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ షాన్ మార్ష్ అగ్రస్థానంలో ఉన్నాడు. మార్ష్ కేవలం 21 ఇన్నింగ్స్‌ల్లోనే 1000 పరుగులు పూర్తి చేశాడు. వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ లెండిల్ సిమన్స్(23 ఇన్నింగ్స్‌ల్లో), ఆస్ట్రేలియా క్రికెటర్ మాథ్యూ హేడెన్(25 ఇన్నింగ్స్‌ల్లో) వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఈ సీజన్లో ఆడిన 5 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ కేవలం ఒక మ్యాచ్‌లోనే గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది.
1⃣0⃣0⃣0⃣ runs in the #SRH jersey for @jbairstow21.#OrangeOrNothing #OrangeArmy #IPL2021 pic.twitter.com/Jem4lXIq48
— SunRisers Hyderabad (@SunRisers) April 26, 2021
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

