విజయం వాకిట్లో ఆసీస్

- ఇంగ్లండ్‌తో రెండో టెస్టు
- యాషెస్ సిరీస్
అడిలైడ్: ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా రెండో విజయానికి చేరువైంది. అడిలైడ్ ఓవెల్ స్టేడియంలో జరుగుతున్న డే అండ్ నైట్ టెస్టులో ఇంగ్లండ్‌కు ఓటమి తప్పేలా కనిపించడం లేదు. ఓవర్‌నైట్ స్కోరు 45/1తో ఆదివారం ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా.. 230/9 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. లబుషేన్ (51), ట్రావిస్ హెడ్ (51) అర్ధశతకాలతో రాణించగా.. ఇంగ్లండ్ బౌలర్లలో రూట్, మలన్, రాబిన్సన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 468 పరుగుల రికార్డు లక్ష్యఛేదనలో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 82/4తో నిలిచింది. చేతిలో 6 వికెట్లు ఉన్న ఇంగ్లిష్ జట్టు.. లక్ష్యానికి 386 పరుగులు వెనుకబడి ఉంది. బర్న్స్ (34), హమీద్ (0), మలన్ (20), రూట్ (24) పెవిలియన్ చేరగా.. బెన్ స్టోక్స్ (3) క్రీజులో ఉన్నాడు. ఆసీస్ బౌలర్లలో రిచర్డ్సన్ రెండు వికెట్లు పడగొట్టాడు. నేడు ఆటకు ఆఖరి రోజు కాగా.. స్వింగ్‌కు సహకరిస్తున్న గులాబీ బంతిని 90 ఓవర్ల పాటు అడ్డుకొని ఇంగ్లండ్ ‘డ్రా’ చేసుకోగలుగుతుందా చూడాలి.
అదే జోరు..
తొలి టెస్టు విజయంతో మంచి జోరు మీదున్న ఆస్ట్రేలియా.. రెండో టెస్టులోనూ అదే ఊపు కొనసాగిస్తూ.. 473/9 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 236 పరుగులకే ఆలౌటవడంతో.. మరోసారి బ్యాటింగ్‌కు దిగిన కంగారూలు 230/9 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీకి చేరువైన వార్నర్ (13) రనౌట్ కాగా.. లబుషేన్, హెడ్, గ్రీన్ (33) ఫర్వాలేదనిపించారు. దీంతో ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యం నిలిచింది. నాలుగో రోజు రెండో సెషన్లో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన ఆసీస్.. ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు పడగొట్టి.. రూట్ సేనను ఇరకాటంలో పడేసింది. ఇక చివరి రోజు ఇంగ్లిష్ ఆటగాళ్లు ఏ మాత్రం పోరాడుతారనేదానిపైనే ఈ మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది.
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 473/9 డిక్లేర్డ్,
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 236,
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 230/9 డిక్లేర్డ్ (లబుషేన్ 51, హెడ్ 51; రూట్ 2/27, మలన్ 2/33),
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 82/4 (బర్న్స్ 34, రూట్ 24; రిచర్డ్సన్ 2/17).
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

