Neeraj Chopra: జావెలిన్ స్టార్ వర్కౌట్ వీడియో చూశారా.. ఆ జంప్స్ మీకు సాధ్యమేనా?
Neeraj Chopra:నీరజ్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. రాబోయే సీజన్ కోసం ఫుల్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆ జావెలన్ స్టార్ తన ట్విట్టర్లో ఓ ట్రైనింగ్ వీడియోను పోస్టు చేశాడు.
హైదరాబాద్: నీరజ్ చోప్రా కఠోర శిక్షణ కొనసాగిస్తున్నాడు. టోక్యో ఒలింపిక్స్.. డైమండ్ లీగ్‌లో గోల్డ్ మెడల్స్ సాధించిన ఆ స్టార్.. ఇప్పుడు రాబోయే సీజన్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. సూపర్ ఫిట్ ఉండే ఈ ఇండియన్ అథ్లెట్ ప్రస్తుతం సౌతాఫ్రికాలోని పోచెస్ట్రోమ్లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఆ శిక్షణకు చెందిన వీడియోను తాజాగా తన ట్విట్టర్లో పోస్టు చేశాడు నీరజ్. ఆ వీడియోకు జంప్స్ అని ట్యాగ్ లైన్ ఇచ్చాడు.
🚧Jumps pic.twitter.com/6qZF7k2Nbu
— Neeraj Chopra (@Neeraj_chopra1) February 15, 2023
వరుసగా ఉన్న హార్డిల్స్పై జంప్ చేస్తూ జావెలిన్ అథ్లెట్ నీరజ్ చోప్రా తన ఫిట్నెస్ ప్రదర్శించాడు. ఈ ఏడాది ఆగస్టులో ఐఏఏఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్ ఉన్న నేపథ్యంలో.. ఆ ఈవెంట్ టార్గెట్‌గా నీరజ్ శిక్షణ తీసుకుంటున్నాడు. ఇక చోప్రా పోస్టు చేసిన వీడియోపై అతని ఫ్యాన్స్ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
ఇన్‌స్టాలోనూ పోస్టు అయిన ఆ వీడియోకు తెగ లైక్‌లు వచ్చేస్తున్నాయి. ఒక్క గంటలోనే సుమారు 70 వేల మంది ఆ వీడియోకు లైక్ కొట్టేశారు. గత ఏడాది బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడలకు గాయం వల్ల నీరజ్ మిస్సైన విషయం తెలిసిందే. ఇక జావెలిన్‌ను 90 మీటర్ల దూరం విసరడమే లక్ష్యంగా నీరజ్ ముందుకు వెళ్తున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

