Novak Djokovic | ఆస్ట్రేలియా ఓపెన్‌లో జొకోకు షాక్.. నాలుగో సీడ్ చేతిలో పరాజయం
పెట్టనికోట లాంటి ఆస్ట్రేలియా ఓపెన్‌లో ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్‌కు చుక్కెదురైంది. గతంలో క్వార్టర్ ఫైనల్ దాటిన పదిసార్లు.. తిరుగులేని ప్రదర్శనతో ఈ టైటిల్ గెలిచిన సెర్బియా వీరుడు ఈ సారి సెమీస్‌లో నాలుగో సీడ్ సిన్నెర్ చేతిలో పరాజయం పాలయ్యాడు.
పెట్టనికోట లాంటి ఆస్ట్రేలియా ఓపెన్‌లో ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్‌కు చుక్కెదురైంది. గతంలో క్వార్టర్ ఫైనల్ దాటిన పదిసార్లు.. తిరుగులేని ప్రదర్శనతో ఈ టైటిల్ గెలిచిన సెర్బియా వీరుడు ఈ సారి సెమీస్‌లో నాలుగో సీడ్ సిన్నెర్ చేతిలో పరాజయం పాలయ్యాడు.
Novak Djokovic | మెల్బోర్న్: సీజన్ ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌లో అతిపెద్ద సంచలనం నమోదైంది. పురుషుల సింగిల్స్‌లో అందరికంటే ఎక్కువ (24) టైటిల్స్ గెలిచిన ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్‌కు సెమీఫైనల్లో షాక్ తగిలింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీస్‌లో టాప్ సీడ్ జొకోవిచ్ 1-6, 2-6, 7-6 (8/6), 3-6తో నాలుగో సీడ్ సిన్నెర్ చేతిలో ఓడాడు.
గతంలో పది సార్లు ఆస్ట్రేలియా ఓపెన్ సెమీస్ ఆడి.. అన్నీంట్లోనూ టైటిల్ గెలిచిన జొకో.. ఈ మ్యాచ్‌లో అదే స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోయాడు. మూడున్నర గంటల పాటు సాగిన పోరులో 54 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. మరో సెమీస్‌లో మెద్వెదెవ్ 5-7, 3-6, 7-6 (7/4), 7-6 (7/5), 6-3తో జ్వెరెవ్‌పై గెలిచాడు. శనివారం మహిళల సింగిల్స్ ఫైనల్లో జెంగ్‌తో సబలెంక తలపడనుండగా.. ఆదివారం మెద్వెదెవ్, సిన్నెర మధ్య తుదిపోరు జరగనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

